సీఎం జగన్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలను ప్రతిపక్ష నేతలే కాకుండా..కొందరు వైసీపీ నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు ఆనం, ప్రసన్న కుమార్ రెడ్డి వంటి నేతలు బాహాటంగానే తమ ప్రభుత్వ విధానాలలోని లోపాలను, వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే….మరి కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాత్రం అంతర్గత సంబాషణల్లో తమ అసంతృప్తి, అక్కసు వెళ్లగక్కుతున్నారు.
కొంతకాలంగా కొత్త జిల్లాల వ్యవహారంపై కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ నియోజకవర్గంలోని మండలాలు పక్క జిల్లాలోకి వెళితే పట్టుపోతోందని వారు వాపోతున్నారు. ఆనం, రోజా వంటి నేతలు జిల్లాల విభజనపై పునరాలోచించాలని కూడా కోరారు. కానీ, జగన్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లనట్లుగా వెళుతున్నారు. ఈ క్రమంలోనే తమ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
ముదునూరి ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానన్న సుబ్బారాయుడు…అందుకు తనను తాను చెప్పుతో కొట్టుకొని శిక్షించుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. నర్సాపురంను జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజల కోరుతున్నారని, కానీ, అసమర్థుడైన ఎమ్మెల్యే ప్రసాదరాజును గెలిపించి తప్పు చేశానని సభలో చెప్పుతో కొట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్నవారంతా షాక్ కు గురయ్యారు. మనం ఓట్లేసి గెలిపించిన అభ్యర్థి ప్రజలను మోసం చేస్తున్నాడని, అందుకే, నర్సాపురాన్ని జిల్లా కేంద్రం కాకుండా చేస్తున్నాడని ఆరోపించారు.
కాగా, కొంత కాలంగా కొత్తపల్లి సుబ్బారాయుడికి, ఎమ్మెల్యే ప్రసాదరాజుకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోందన్న ప్రచారం నియోజకవర్గంలో ఉంది. తాజా పరిణామాలతో ఆ ప్రచారం నిజమనిపిస్తోంది. మరి, ఈ ఘటనపై జగన్ రియాక్షన్ ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
బ్రేకింగ్ న్యూస్;
సియంగా జగన్ ను, నర్సాపురం ఎమ్మెల్యే గా ముదునూరి ప్రసాదరాజు ను గెలిపించి నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. నర్సాపురం ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం pic.twitter.com/SpCdYXCyBU
— TeluguDesamPoliticalWing (@TDPoliticalWING) March 2, 2022