తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు హైదరాబాద్ వేదికగా భేటీ అ య్యారు. అయితే.. వారు ఏం చర్చించారనేది పక్కన పెడితే.. అసలు వీరి భేటీనే వైసీపీ నాయకులు హడా వుడి పడిపోవడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. రాజకీయాల్లో ఒకపార్టీ నాయకుల తో మరొక పార్టీ నాయకులు భేటీ కాకూడదని ఏమీ లేదు.
నిజానికి చెప్పాలంటే..రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు.. అంటూ ఎవరూ లేరు. ఉండరు కూడా. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ నేతల మధ్యభేటీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. అయితే.. వైసీపీ నాయకులు మాత్రం దీనిని తీవ్రస్థాయిలో చూస్తున్నారు. ఇలా ఎందుకు చేయాల్సిన అవసరం ఉందనేది ప్రశ్న. పైగా.. తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా? అనేది మరో ప్రధాన ప్రశ్న.
నిజానికి వైసీపీ పై ప్రజల్లో అభిమానం ఉందని, జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెబుతున్న వైసీపీ నాయకులు.. జనసేన-టీడీపీ కలిస్తే ఎందుకు ? భయపడుతున్నారనేది కీలక విషయం. నిజానికి ఎన్ని పార్టీలు కలిసినా.. జగన్‌కు తిరుగులేదని, ఆయన గెలుపును ఎవరూ ఆపలేరని చెబుతున్న నాయ కులు.. ఈ రెండు పార్టీల నాయకులు కలిస్తే ఎందుకు వణికిపోతున్నారా? అనేది మరో ప్రశ్న.
ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబును కలిస్తే.. ఎందుకు బాధపడుతున్నారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. మాత్రం జగన్‌కు వచ్చే ఇబ్బంది లేదని చెబుతున్న నాయకులు ఇలా ఎందుకు.. విరుచుకుపడుతున్నారు? దీనివల్ల వైసీపీకి ప్లస్ కాకపోగా.. మరింత మైనస్ అవుతుందనే వాదన వినిపిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.