యాత్ర 2 సినిమా టిక్కెట్లు కొని ప్రజలకు ఉచితంగా చూపించాలని వైసీపీ అధినాయకత్వం ఇచ్చిన నిర్ణయాలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు భేఖాతార్ చేయడంతో పాటు పిచ్చ లైట్ తీస్కొన్నారు. నాలుగున్నరేళ్లలో తాము అడిగిన అభివృద్ధి పనులు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు.. ఇప్పుడు తమ దగ్గుర దోచుకోవడానికి ఇదో మార్గమా ? అని వైసీపీ ఎమ్మెల్యేలు అసలు ఈ సినిమాను పట్టించుకోలేదు. గతంలో యాత్ర సినిమా రిలీజ్ టైంలో బాగా హడావిడి, హంగామా కనిపించింది.
ఇప్పుడు యాత్ర 2 సినిమాకు వేసిన ప్రీమియర్ షోకు మాత్రం కొందరు ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు వచ్చారు. అసలు మిగిలిన వాళ్లు ఎవ్వరూ ఈ సినిమాను పట్టించుకున్న పాపాన పోలేదు. మంత్రులు, బాగా సంపాదించుకున్న కొందరు నేతలు మాత్రం తొలి రోజు తొలి షోకు కొంత హడావిడి చేశారు. తొలి రోజు అసలు ఆడియెన్స్ కూడా పెద్దగా రాలేదు. వైసీపీ ఫ్యాన్స్ హంగామా మాత్రమే కనపడింది.
చాలా చోట్ల వైసీపీ నేతలే టిక్కెట్లు కొని పంపిణీ చేశారు. అయినా కూడా 50 శాతం కూడా ఆక్యుపెన్సీ రాలేదు. తెలంగాణలో అయితే ఈ సినిమాను పట్టించుకున్న వాళ్లు కూడా లేరు. మల్టీఫ్లెక్స్లకు అద్దె కట్టుకోవాలి కాబట్టి తొలి రోజు 20 శాతం ఆక్యుపెన్సీ చూపించారని చెపుతున్నారు. తెలంగాణలో చాలా చోట్ల థియేటర్లకు రెంట్ తిరిగి కట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పైగా సినిమాలో కంటెంట్ కూడా యాత్రలా లేదని… యాత్ర 2 అంతా చరిత్ర వక్రీకరణ, వక్రభాష్యంతో ఉందంటున్నారు. ఓవరాల్గా యాత్ర 2 సినిమాకు భారీ నష్టాలు రావడం ఖాయమయింది. అయితే అది ఎన్నికల పెట్టుబడి అని.. ఖర్చు పెద్ద విషయం కాదని.. ఉచితంగానే ప్రదర్శిస్తారని వైసీపీ వర్గాలంటున్నాయి. త్వరలో వ్యూహం, శపథం కూడా రిలీజ్ చేసి వాటిని కూడా ఫ్రీగా చూపించాలని వైసీపీ వాళ్లు ఆదేశాలు జారీ చేస్తారంటున్నారు.
టీడీపీ రిలీజ్ చేసిన అంతిమయాత్ర ట్రైలర్ కింద చూడొచ్చు.
మసిరెడ్డి కి అంతిమయాత్ర చేస్తూనే ఉన్నారు…
అప్పటి నుంచి ఇప్పటివరకు.. ఎప్పటివరకు అయినా మసి గాలిలో ఎగురుతూనే ఉంటుంది ???? pic.twitter.com/TFBjiR0Lea
— Sudheer Anantha (@AnanthaSudheer) February 8, 2024