రాజకీయాల్లో అంచనాలు తలకిందులు అవడం, ఆశించినవి అనుకోకుండా జరిగిపోవడం కొత్తేం కాదు. అయితే విజయం దక్కితే తమ క్రెడిట్ అని… తేడా జరిగితే పరిస్థితుల ప్రభావం అని ప్రస్తావించడం నేతల వైఖరి. ఇప్పుడు తాజాగా ఇదే చర్చ జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించే ఈ ప్రస్తావన. మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం విషయంలో క్రెడిట్ గురించి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ముఖ్య నేత కల్వకుంట్ల కవిత కామెంట్ల తీరు.
ఊహించని రీతిలో మహిళా శాతం రిజర్వేషన్ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చేస్తూ కేబినెట్ నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సమావేశాల్లోనే అందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలియజేసింది. అయితే బిల్లు కేంద్రం నిర్ణయం లేదా ఫలితమా లేకపోతే ఆయా రాజకీయ పార్టీల పోరాట ఫలమా అనేది సహజంగానే ఆసక్తికరమైన అంశం. రిజర్వేషన్లు తమ పోరాట ఫలితమే అని సోనియాగాంధీ పేర్కొంటుండగా బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత తరఫున తాము చేసిన ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం వెలువడిందని ప్రస్తావించారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు హాజరైన సోనియాగాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందిస్తూ తమ పోరాటం ఫలితంగానే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేత కవిత చేసిన పోరాటాల ఫలితంగానే కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిందని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది ఏకంగా పార్టీ నేతలు కవిత ఇంటికి పోలోమంటూ క్యూ కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ చాటిచెప్పుకొంటున్నారు. ఇంతకీ ఈ బిల్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయమా లేదా మీ ఆయా పార్టీల పోరాటానికి తలొగ్గిన ఫలితమా అనేది ఆసక్తికరంగా మారింది.