ఏపీలో ఓటు బ్యాంకు పెరుగుతుందా? గత ఎన్నికలకు ఇప్పటికి ఓటు బ్యాంకులో మార్పు వచ్చిందా ? అం టే. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో ప్రస్తుతం 4 కోట్ల 6 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. వీటిలో 2 కోట్ల 8 లక్షల మంది మహిళలు ఉన్నారు. పురుషుల ఓట్లు కోటీ 82 లక్షలు ఉన్నాయి. ఇక, మిగిలి నవి ట్రాన్స్ జెండర్లు, ఎన్నారై ఓట్లు ఉన్నాయి. ఇక, ఇదే లెక్క గత ఎన్నికల సమయానికి తక్కువగా ఉంది.
2019 ఎన్నికల సమయానికి రాష్ట్రంలో 3.80 కోట్ల మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. అంటే.. గత ఎన్నిక లకు ఇప్పటికి భారీగా ఓటు బ్యాంకు పెరిగింది. అయితే.. ఓటు బ్యాంకు పెరిగినంత మాత్రాన.. ప్రభావం పడుతుం దని చెప్పలేరు. కానీ, పార్టీలు తీసుకుంటున్న లైన్.. వేస్తున్న అడుగులు ప్రభావితం చూపుతు న్నాయి. ఈ పరిణామమే… ఓటు బ్యాంకు పెరిగేందుకు దారి తీస్తున్నాయి. గత ఎన్నికలను తీసుకుంటే.. వైసీపీ విషయంలో సానుభూతి పెరిగిన నేపథ్యానికి తోడు.. పాదయాత్ర పనిచేసింది.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. ఇప్పుడు చంద్రబాబు విషయంలో విజన్ అనే ఆలోచన, నారా లోకేష్ పాద యాత్ర ఎఫెక్ట్ వంటివి బాగానే పనిచేస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. దీనికి తోడు చంద్రబాబు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు.. మహిళలను మంత్రముగ్ధులను చేస్తున్నాయన్న వాదన కూడా ఉంది. ఇది .. ఈ దఫా ఓటు బ్యాంకు పెంచేందుకు దోహద పడుతుందని చెబుతున్నారు. గతంకన్నా ఎక్కువగా నే ఓట్లు పెరుగుతాయని అంటున్నారు.
అంతేకాదు.. సాధారణంగా.. మహిళా ఓటు బ్యాంకు ఎలా ఉన్నా.. పురుష ఓటు బ్యాంకు పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. యువత ప్రధానంగా ఈ సారి పోటెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. నిరుద్యోగం, ఉపాధి కల్పన, విదేశీ విద్య వంటివి ప్రభావం చూపుతున్న దరిమిలా.. యువత ఓటు ఈ సారి పక్కాగా బూత్‌లకు వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. అంటే ఎలా చూసుకున్నా.. టీడీపీ ప్రకటించిన గ్యారెంటీలు.. రాష్ట్రంలో ఓటు బ్యాంకును పెంచే అవకాశం ఉంటుందని అంటున్నారు.