కొన్ని ఫొటోలకు క్యాప్షన్లు అవసరం లేదు. వాటికవే మాట్లాడతాయి. తండ్రి అధికారంలో ఉన్నపుడు ఎదిగి వచ్చిన కొడుకు లోకేష్. అతను ప్రతిపక్ష రాజకీయానుభవం చూస్తున్నది ఇది మొదటిసారి. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నపుడే ఎవరికైనా ప్రజలతో బలమైన సంబంధాలు ఏర్పడతాయి.
ఇపుడు లోకేష్ తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఉండగా అలాంటి దృశ్యాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.