రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించి హ్యాట్రిక్ కొట్టడం ఎలా అన్నది ఇప్పుడు కేసీఆర్ ముందున్న టార్గెట్. హ్యాట్రిక్ కొట్టాలన్న కేసీఆర్ ఆలోచన బాగానే ఉంది కానీ అందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కారణం ఏమిటంటే కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుండటమే. కేసీఆర్ హామీలు సంపూర్ణంగా అమలు కాకపోవటం, అమలవుతున్న పథకాల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మంత్రులు, ఎంఎల్ఏలపై జనాల్లో బాగా వ్యతిరేకత కనబడుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిపోతోంది.
ఈ మధ్యనే తుక్కుగూడ బహిరంగ సభలో సోనియాగాంధి ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్ పై జనాల్లో బాగా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సిక్స్ గ్యాంరెటీస్ పథకాలను అమలు చేస్తామని సోనియా హామీ ఇచ్చారు. ఆ హామీపై జనాల్లో సానుకూల స్పందన కనబడుతోంది. దాంతో కాంగ్రెస్ గ్రాఫ్ మెల్లిగా పెరుగుతోంది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందంటే అర్ధం బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిపోతోందని కాదు అర్ధం.
రెండు పార్టీల మధ్య అంతరం తగ్గిపోతోందని. ఒకపుడు బీఆర్ఎస్ గ్రాఫ్ 45 శాతం ఉండేది. కాంగ్రెస్ గ్రాఫ్ 34 శాతం దగ్గరుండేది. అలాంటిది ఇపుడు అనేక కారణాల వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ 39 శాతానికి పెరిగింది. అంటే హస్తంపార్టీ గ్రాఫ్ 5 శాతం పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ గ్రాఫ్ పెంచుకోవటం ఎలాగన్న విషయంలో కేసీయార్ టెన్షన్ పెరిగిపోతోంది. గ్రాఫ్ పెంచుకోవాలంటే కచ్చితంగా కొత్త పథకాలను ప్రకటించాల్సిందే అన్నది అర్ధమవుతోంది. ఎందుకంటే ఇపుడున్న పథకాలు సరిగా అమలు కావటంలేదు కాబట్టి కొత్త పథకాలు ప్రకటించకపోతే జనాలు పట్టించుకోరు.
ఉన్న పథకాలనే సక్రమంగా అమలు చేయనపుడు కొత్త పథకాలను ప్రకటిస్తే మాత్రం జనాలు పట్టించుకుంటారా అన్నది కీలకమైన ప్రశ్న. ఈ పరిస్థితుల్లోనే అన్నీ పథకాలకు అవసరమైన నిధులను విడుదల చేసి కొత్త పథకాలన ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే కొత్త పథకాలపై తీవ్రస్ధాయిలో కసరత్తు చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. గడచిన మూడు వారాలుగా కేసీయార్ పార్టీనేతలకు అందుబాటులో లేరు. కొత్తగా ఇవ్వబోయే హామీలు కాంగ్రెస్ ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్ కు ధీటుగా ఉండాలని కేసీయార్ ఆలోచిస్తున్నారు. ఈ విషయంలోనే బాగా బిజీగా ఉన్నట్లు సమాచారం. మరి 16వ తేదీన వరంగల్లో జరగబోయే సింహగర్జన బహిరంగసభలో ఏమి ప్రకటిస్తారో చూడాల్సిందే.