ఈ హైటెక్ యుగంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధం మోజులోపడి ఎంత దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఏం చేసేందుకైనా సిద్ధపడుతున్నారు. ప్రియుడుతో కలిసి భర్తలను చంపిన భార్యలు కొందరైతే…సుపారీ ఇచ్చి మరీ కిరాయి హంతకులతో కట్టుకున్న వారిని కడతేర్చిన వారు మరికొందరు. ఇక, తన భర్తతో జీవించడం ఇష్టం లేక డబ్బు నగలతో ఉడాయించి మహిళలు ఇంకొందరు.
తాజాగా ఢిల్లీలో తన భర్తకు దూరంగా ఉంటున్న మహిళ ఇంటి నుంచి పారిపోయిన కేసు ఈ కోవలోకే వస్తుంది. తన ప్రియుడితో కలిసి కోటి రూపాయల విలువైన నగలతో జంప్ అయిన భార్య వైైనం ఇప్పుడు దేశరాజధానిలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమెపై భర్త కేసు పెట్టడంతో భయపడాల్సిన భార్య తిరిగి భర్త, అత్తమామలనే బెదిరిస్తున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన దగ్గర అత్తమామల న్యూడ్ వీడియోలు ఉన్నాయని, తనపై పెట్టిన కేసు వాపస్ తీసుకోకుంటే ఆ వీడియోలను బట్టబయలు చేస్తానని కోడలు బెదిరిస్తోంది.
దీంతో, ఈ విషయాన్ని సదరు భర్త పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలోనే వారు అతని భార్య, ఆమె ప్రియుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన ఆభరణాల వ్యాపారి కుటుంబంలో జరిగిన ఈ వైనం నగరంలో చర్చనీయాంశమైంది. ఆ భార్యాభర్తల మధ్య గత నాలుగేళ్లుగా మనస్పర్థలున్నాయి. దీంతో, వారు ఒకే ఇంట్లో వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆ భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో కోటి రూపాయల నగలు తీసుకొని ఇంటి నుంచి ఉడాయించింది.