తెలంగాణ పోలీసు డిపార్ట్ మెంట్ లో కొందరు ప్రజలకు దూరంగా రాసలీలలకు దగ్గరగా ఉన్నారనే కామెంట్లు వస్తున్నాయి. ఇటీవల మాజీ సీఐ నాగేశ్వరరావు.. తన ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి భార్యను కణతి దగ్గర తుపాకీ పెట్టి మరీ అత్యాచారం చేయడం.. ఈ క్రమంలో ఉద్యోగం పోగొట్టు కోవడం తెలిసిందే. అయితే, ఈ ఉదంతం మరవక ముందే మరో ఇన్స్పెక్టర్ రాసలీలల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురంలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న రాజు వివాహేతర సంబంధాన్ని భార్య గుట్టు రట్టు చేసింది. సీఐ రాజు.. యువతితో కారులో సెక్స్ చేస్తున్న సమయంలో భార్య అక్కడికి వెళ్లింది. దీంతో అక్కడ గొడవ కావడంతో.. వెళ్లిన పోలీసులపై సీఐ దాడికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ వనస్థలిపురంలో ఇన్స్పెక్టర్ రాజును వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి వనస్థలిపురం పరిధిలో నిర్మానుష్య ప్రాంతంలో కారులో ఓ యువతితో సీఐ సెక్స్ చేస్తుండడాన్ని చూసిన ఆయన భార్య ఇద్దరు పిల్లలతో అక్కడికి వెళ్లి గొడవపెట్టుకుంది. ఇది గమనించిన పోలీసులు.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా… సీఐ రాజు కానిస్టేబుల్‌పై దాడి చేసి… సెల్‌ఫోన్ పగులగొట్టాడు. దీంతో పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చిన కానిస్టేబుళ్లు మరో పోలీస్ వాహనంలో వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాదులో సౌత్ జోన్ కంట్రోల్ రూమ్‌లో రాజు ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే, ఆయన మద్యం మత్తులో ఓ యువతిని తీసుకుని కారులో వనస్థలిపురం శివారులో రాసలీలల్లో మునిగి తేలుతున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన భార్య ఆటోలో అక్కడకు వచ్చి సార్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇక, ఈ క్రమంలో రాజు తనను అడ్డుకోబోయిన కానిస్టేబుళ్లపై దాడి చేయడంతో కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో సీఐపై చర్యలు తీసుకోవాలని కానిస్టేబుల్స్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.
ఈ మేరకు సీఐ రాజుపై 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్గా 10 రోజుల క్రితమే హైదరాబాద్ సీసీఎస్‌కు బదిలీ కాగా ఇంకా జాయిన్ కాలేదు. నిన్నటి వరకు మునుగోడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ రాజు… ఉస్మానియా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం వనస్థలిపురం పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు.