• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చిదంబరంపై సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్…పాత పగతోనే టార్గెట్ చేశారా?

admin by admin
May 18, 2022
in Andhra, India, Politics, Top Stories
0
0
SHARES
270
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబ‌రంపై వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌యసాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చిదంబరాన్ని ఓ ఆర్థిక ఉగ్ర‌వాదిగా అభివ‌ర్ణించిన సాయిరెడ్డి, చిదంబరాన్ని త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు చిదంబరానికి నైతిక‌తే లేద‌ని, చిదంబ‌రం వ్య‌వ‌హారాల‌ను లా కాలేజీలు కేస్ స్ట‌డీలుగా తీసుకోవాల‌ంటూ షాకింగ్ కామెంట్లు చేయడం దుమారం రేపింది.

మ‌నీ ల్యాండ‌రింగ్ ద్వారా చైనా పౌరుల‌ నుంచి లంచాలు తీసుకుని వీసాలు ఇప్పించారంటూ చిదంబ‌రంపై సాయిరెడ్డి ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. కేబినెట్ మంత్రి హోదాలో చిదంబ‌రం ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ (ఐపీసీ)లోని అన్ని నేరాల‌కు పాల్ప‌డ్డార‌ని సంచలన ఆరోపణలు చేశారు. తాను చేసిన అన్ని త‌ప్పుల‌కు చిదంబ‌రం ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చిందని సాయిరెడ్డి అన్నారు. త‌క్ష‌ణ‌మే చిదంబ‌రాన్ని అరెస్ట్ చేయాల‌ంటూ #arrestchidambaram ను పోస్ట్ చేశారు.

ఇక, 2004- 14 మ‌ధ్య‌లో కేంద్ర మంత్రి హోదాలో చిదంబ‌రం తీసుకున్న అన్ని నిర్ణ‌యాలు, వ్య‌వ‌హారాల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని సాయిరెడ్డి డిమాండ్ చేశారు. త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై నిర్దయగా త‌ప్పుడు కేసులు పెట్టించిన చిదంబ‌రం, ఇపుడు ప‌రిస్థితి అంతా తారుమారయ్యేసరికి నీతి వచనాలు వల్లిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిదంబ‌రం విత్తిన పాపం ఇప్పుడు ఫ‌లాలు ఇస్తోందని, జాతి వ్య‌తిరేక కార్య‌కలాపాల‌కు పాల్ప‌డ్డ చిదంబ‌రం కోట్లరూపాయల ధ‌నాన్ని సంపాదించార‌ని ఆరోపించారు.

చిదంబ‌రం జాతి వ్య‌తిరేకి అని, అటువంటి ఆర్థిక నేరగాడు ఆర్థిక‌, రాజ‌కీయ అంశాల‌పై ధైర్యంగా ఉప‌న్యాసాలివ్వడం ఏమిటో త‌న‌కు అర్థ‌ం కాలేద‌ని అన్నారు. ప‌ట్ట‌ప‌గ‌లే దోపిడీల‌కు పాల్ప‌డ్డారంటూ చిదంబ‌రంపై విమర్శలు గుప్పించారు. చిదంబ‌రం అక్ర‌మాల వలన స‌ర్కారీ ఖ‌జానాకు భారీ న‌ష్టం వాటిల్లింద‌ని, ధ‌నికుల కోసం పేద‌ల‌ను ద‌రిద్రంలో కూరుకుపోయేలా చిదంబ‌రం వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. దేశంలో యూపీఏ హయాంలో స్కాంల‌కు పాల్ప‌డ్డ అంద‌రితోనూ చిదంబ‌రం ఒప్పందాలు కుదుర్చున్నార‌ని సాయిరెడ్డి విమర్శించారు.

అయితే, హఠాత్తుగా చిదంబరాన్ని సాయిరెడ్డి ఎందుకు టార్గెట్ చేశారన్న విషయంపై చర్చ జరుగుతోంది. మరోసారి రాజ్యసభకు నామినేట్ అయిన ఊపులో విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ను కేసులలో ఇరికించడంలో చిదంబరం పాత్ర కూడా ఉందని, అందుకే ఇపుడు చిదంబరం, ఆయన తనయుడు కార్తీపై ఆర్థికపరమైన కేసులు నమోదువుతున్న తరుణంలో సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చి జగన్ పై స్వామిభక్తి చాటుకుంటున్నారని అంటున్నారు. ఇక, కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు లేదని స్పష్టమైన సంకేతాలిచ్చేందుకే ఇలా విమర్శలు గుప్పించారని మరో టాక్. ఇక, ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో చిదంబరానికి, సాయిరెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలోనే ఆయనను సాయిరెడ్డి టార్గెట్ చేశారని తెలుస్తోంది.

Tags: ex central minister chidambaramfinancial terrorist chidambarammp vijayasai reddysaireddy slams chidambaramshocking comments on chidambaram
Previous Post

ఆ మంత్రిపై తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్లు…కోర్టులో పంచాయతీ?

Next Post

‘F3’ టికెట్ రేట్లపై రచ్చ…దిల్ రాజు షాకింగ్ నిర్ణయం

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post

‘F3’ టికెట్ రేట్లపై రచ్చ...దిల్ రాజు షాకింగ్ నిర్ణయం

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra