అఖండ భారతదేశంలో భాగంగా ఉన్న ప్రాంతాలే నేడు అప్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ గా ఏర్పాడ్డాయి. ఇప్పటి బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్ లో భాగం. దానిని తూర్పు పాకిస్తాన్ అనేవారు. అయితే… ఒకదేశం మనకు అటు ఇటు ఉండటం వల్ల అంతర్గతంగా మన ద్వారా రోడ్డు మార్గం పొందడం పాకిస్తాన్ కి ఒక హక్కుగా మారింది. దీనికి అంతర్జాతీయ మద్దతు కూడా పాకిస్తాన్ కు లభించింది.
దీనివల్ల భారతదేశం ప్రైవసీ ప్రమాదంలో పడింది. అయితే ఇదే సమయంలో తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్ ) పాకిస్తాన్ నుంచి స్వతంత్ర దేశంగా ఎదగాలని కోరుకుంటోంది. బంగ్లాదేశ్ ప్రజల్లోని కోరికను గమనించిన ఇందిరాగాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎవరికీ తెలియకుండా వారి పోరాటానికి మద్దతు ఇచ్చి, భౌతికంగా భారత సైన్యం తో కూడా సహకారం అందించి… నేటి బంగ్లాదేశ్ అవతరణకు కారకురాలైంది.
పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయాక బంగ్లాదేశ్ నుండి ‘మతువా’ అనే వర్గం వాళ్ళు వెస్ట్ బెంగాల్ కి వచ్చి స్థిరపడ్డారు. బెంగాల్ లో ఈ మతువా సామాజిక వర్గ జనాభా సుమారు కోటి 75 లక్షల పైన ఉంటారు….అంటే సుమారు 20% ఓట్లు. ఇపుడు వీటిపై మోడీ కన్నేశారు.
2009 నుండి ఈ సామాజిక వర్గపు వోట్లు అన్ని TMC వైపే ఉన్నాయ్…ఎలాగైనా ఈ వోట్ బాంక్ కొల్లగొట్టాలని బీజేపీ ప్లాన్. ఆ సామాజిక వర్గానికి చెందిన శక్తి పీఠాలు బంగ్లాదేశ్ లోనే ఉన్నాయ్…ఈరోజు మోడీ గారు ఆ శక్తి పీఠాన్ని సందర్శించబోతున్నారు. ఆ విధంగా ఆ సామాజికవర్గానికి దగ్గర అవచ్చు అన్నమాట.
ఓట్ల కోసం బంగ్లాదేశ్ ఏంటి బంగాళాఖాతంలోకి అయినా వెళ్తారు మా మోడీ గారు… అని సోషల్ మీడియాలో జనం వ్యాఖ్యానిస్తున్నారు.