జగన్ అధికారంలోకి రాక ముందు జగన్ అది, జగన్ ఇది, చాలా స్ట్రాంగ్ అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ జగన్ ఒక సుధాకర్, ఒక రంగనాయకమ్మకు కూడా భయపడతారు. వాళ్లు నోరి విప్పినా తన ప్రభుత్వం కూలిపోతుందేమో అని భయపడుతు వారి నోళ్లు మూయిస్తుంటారు.
ఇప్పటికీ అరెస్టులు ఆపడం లేదు. మొన్న ఎవరో టీచర్ మెసేజ్ పంపాడని సస్పెండ్ చేసింది సర్కారు. ఇవన్నీ చూస్తుంటే జగన్ చాలా భయస్తుడు అన్న విషయం అర్థమవుతుంది.
రఘురామరాజు విషయమే తీసుకుందాం. అతను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని జగన్ అతని పార్టీ ఆరోపిస్తుంది. కానీ అతన్ని సస్పెండ్ చేయడానికి జగన్ కి ధైర్యం చాలడం లేదు. అంటే జగన్ పీకే కట్టిన ఒక కటౌట్ మాత్రమే గాని రియల్ డేర్ పొలిటీసియన్ కాదని స్పష్టంగా అర్థమైపోతోంది.
అదే చంద్రబాబు అయితే… వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి వీళ్ళు జగన్ రెడ్డిని కలిశారని తెలియగానే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మనకు తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని జంకలేదు.
ధైర్యంగా అడుగువేశారు. కానీ RRR నిజంగా చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తున్నాడని నమ్మితే ఈ ఉత్తుత్తి ప్రచారాలు కట్టిపెట్టి అతన్ని సస్పెండ్ చేయొచ్చు కదా… ఎందుకు భయము?
పిల్లలు, వృద్ధులు కూడా తన ప్రభుత్వాన్ని కూల్చగలరు అని భయపడే వ్యక్తి ఇక సస్పెండ్ ఏం చేస్తాడులేండి.