‘‘దమ్ముంటే తెలంగాణలోAPRTC బస్సులు తిప్పు జగన్‘‘

Andhra Oct 05, 2020

జేసీ ప్రభాకర్ రెడ్డి... మరోసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సులు ఆపడం కాదు, దమ్ముంటే తెలంగాణ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తిప్పు. రాజకీయం గురించి మాట్లాడాల్సింది చాలా ఉంది. సమయం వచ్చినపుడు మాట్లాడదాం. చేతకాని రూలింగ్ గురించి మాట్లాడాలి ముందు. జనాలు బస్సుల కోసం ఇబ్బంది పడుతున్నారు. చేతనైతే, దమ్ముంటే తెలంగాణలో ఏపీ ఆర్టీసీ బస్సులు తిప్పండి జగన్ . మిగతావి మళ్లీ చూసుకుందాం అని తనకు అలవాటైన ఘాటు మాటలు కూడా వాడేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

ఒక ఆలయ సందర్శనకు వచ్చిన సందర్భంగా గుత్తిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. అపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ఇదే.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.