అవును నిజమే కదా, చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఎందుకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదు. పోనీ జగన్ ఎన్నికల హామీ ఇచ్చాక అయినా పెట్టొచ్చు కదా అని చాలామంది వైసీపీ నాయకులు వ్యంగాస్త్రాలు వేస్తున్నారు. సామాన్యుల్లో కూడా ఈ అనుమానం ఉన్నది నిజమే. కానీ దాని వెనుక పెద్ద కథే ఉంది.
ఆ విషయం తెలుసుకునే ముందు… ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి.
హైదరాబాదులో ఒక పెద్ద ఇండోర్ స్టేడియం కట్టి దానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని కాంగ్రెస్ సీఎం పేరు పెట్టిన వ్యక్తి చంద్రబాబు.
హైదరాబాదులో ఒక పెద్ద టూరిజం ప్లేస్ లో ఎన్టీఆర్ ఘాట్ పెట్టి ముఖ్యమంత్రులు తిరిగే ఆ రోడ్డుకు ఎన్టీఆర్ మార్గ్ అని పెట్టింది చంద్రబాబు.
ట్యాంక్ బండ్ కింద ఒక పెద్ద గ్రౌండ్ కు ఎన్టీఆర్ స్టేడియం అని పెట్టింది చంద్రబాబు.
వీటన్నింటికి మించి అంతర్జాతీయ ప్రముఖులు, హైదరాబాదుకు వచ్చే విదేశీ ప్రధానులు, ప్రెసిడెంట్లు, పారిశ్రామిక వేత్తలు, అంబాసిడర్లు ప్రతిరోజు తిరిగే ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.
చివరకు దానిని శంషాబాద్ కు తరలించినపుడు నిర్దాక్షిణ్యంగా కక్షతో ఎన్టీఆర్ పేరును తొలగించి రాజీవ్ గాంధీ పేరును పెట్టింది ఈ జగన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.
కనీసం డొమెస్టిక్ టెర్మినల్ కి అయినా ఎన్టీఆర్ పేరు పెట్టమని ఎన్నిసార్లు రిక్వెస్టు చేసిన దానిని పట్టించుకోకపోగా అడ్డుకున్న వ్యక్తి వైఎస్సార్.
కట్ చేస్తే… 2014 లో బీజేపీతో కలిసి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లో డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెడుతూ అధికారిక ఉత్తర్వులు వచ్చేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. అశోకగజపతిరాజు అప్పుడు విమానయాన శాఖ మంత్రి. ఇపుడు అధికారికంగా అక్కడ ఎన్టీఆర్ పేరు ఉంది.
ఎన్టీఆరు పేరును తండ్రి ఎయిర్ పోర్టు నుంచి తొలగిస్తే… కొడుకు ఏపీలో కనిపించకుండా చేసిన ఘనుడు. చంద్రబాబు ఎన్టీఆర్ పేరుతో 18 పథకాలకు పేరు పెట్టారు అన్న విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ అన్నం పెట్టే క్యాంటీన్లకు అన్న క్యాంటీన్లని ఎన్టీఆర్ బొమ్మతో పెట్టిన విషయం గుర్తుంచుకోవాలి. వీటన్నింటిని జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేరు తీసేసి ఎన్టీఆర్ ని అవమానించిన విషయం గుర్తుంచుకోవాలి.
ఇపుడు కేవలం వైసీపీ కోసం ఎన్టీఆర్ ను వాడుకోవడానికే ఆ పేరు పెట్టిన విషయం గుర్తుంచుకోవాలి. రాజధాని గొడవ వల్ల దూరమైన కృష్ణా గుంటూరు ప్రజలను కాపు, కమ్మ గొడవలు పెట్టి ఒక వర్గం ఓట్లు కొల్ల గొట్టే కుతంత్రం ఇది.
మరి అన్నింటికి పేరు పెట్టిన చంద్రబాబు కృష్ణా జిల్లాకు ఎందుకు పేరు పెట్టలేదు?
నిజమే ఇది సామాన్యులకు వచ్చే అనుమానమే. దాని వెనుక కథ ఇది.
అవకాశం ఉన్నా లేకున్నా చంద్రబాబుపై కులముద్ర వేసే వ్యూహాత్మక చర్యల్లో వైసీపీ తరచుగా ముందుంటోంది.
ఇక చంద్రబాబు ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ యంత్రాంగం ఆ జిల్లాకు కుటుంబం, కులం రంగు పులుముతుంది.
ఎన్టీఆర్ వంటి లెజెండ్ ను రాజకీయ వివాదాల్లో ఉంచడం చంద్రబాబుకు ఇష్టం లేదు.
రెండో కారణం కృష్ణా జిల్లా జనాభా స్వరూపం. కృష్ణా జిల్లాలో కమ్మ, కాపు సామాజిక వర్గాలు ప్రభావవంతమైన స్థానంలో ఉన్నాయి. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినట్లయితే జిల్లాలో రాజకీయ వివాదాలకు స్వయంగా చంద్రబాబే ఆజ్యం పోసినట్టవుతుంది. చంద్రబాబు ఎప్పటిలాగానే అతిజాగ్రత్తగా వ్యవహరిస్తూ ఆ జిల్లా పేరు మార్పు జోలికి పోలేదు. దాంతో తన పార్టీ వ్యవస్థాపకుడి పేరు కూడా పెట్టులేకపోయారనే నింద మోయాల్సి వచ్చింది.
చంద్రబాబు ఎన్టీఆర్ పేరుతో 18 పథకాలకు పేరు పెట్టారు అన్న విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ అన్నం పెట్టే క్యాంటీన్లకు అన్న క్యాంటీన్లని ఎన్టీఆర్ బొమ్మతో పెట్టిన విషయం గుర్తుంచుకోవాలి. వీటన్నింటిని జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పేరు తీసేసి ఎన్టీఆర్ ని అవమానించిన విషయం గుర్తుంచుకోవాలి. ఇపుడు కేవలం వైసీపీ కోసం ఎన్టీఆర్ ను వాడుకోవడానికే ఆ పేరు పెట్టిన విషయం గుర్తుంచుకోవాలి.
వైఎస్సార్ పేరు కడప జిల్లాకు పెడితే ఎవరైనా కడప అనుకుండా వైఎస్సార్ జిల్లా అంటున్నారా?
కానీ
నేటికీ అది హైదరాబాదులో ఎన్టీఆర్ మార్గ్ అనే పిలుస్తారు, ఎన్టీఆర్ స్టేడియం అనే పిలుస్తారు. ఎయిర్ టెర్మినల్ పై ఎన్నటికీ ఎన్టీఆర్ పేరు నిలిచి ఉంటుంది. ఇపుడు చెప్పండి జిల్లా పేరు మార్చడం ఎంత సేపు… ఓ వర్గం ప్రజల మనసు నొప్పించకూడదనే కదా ఈ వ్యవహారం. వైసీపీ కుట్రల్లో పడి తెలుగుదేశం ఘాటైన సమాధానం ఇవ్వలేకపోతోంది. నడిబొడ్డులో ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగలగొట్టాలని ప్రయత్నించిన దుండుగులు వైసీపీ నేతలు కాదా? ఈ విషయం జనాలు మరిచిపోతారా?