నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే. ఎయిమ్స్ లో రఘురామ మెరుగైన వైద్య చికిత్స తీసుకోనున్న విషయం విదితమే. ఏపీలో తన కనుసన్నల్లో ఉన్న ఆస్పత్రులలో రఘురామకు వైద్యం చేయించి…తప్పుడు నివేదికలతో మేనేజ్ చేయాలని జగన్ సర్కార్ చూసిందని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే.
సుప్రీం జోక్యంతో సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు చికిత్స అందించారని, అక్కడ జగన్ పప్పులు ఉడకలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజుగారికి గట్టి పట్టున్న ఢిల్లీకి చేరారని, ఇక, అక్కడి నుంచే ఆయన చక్రం తిప్పుతారని అంటున్నారు. ఢిల్లీలోని కేంద్ర పెద్దలను రఘురామ కలిసి తనపై జగన్ సర్కార్ బనాయించిన అక్రమ కేసులు, అరెస్ట్, కస్టడీలో దాడి వంటి అంశాలపై ఫిర్యాదు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
మహామహులకే కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకదని, అటువంటిది రఘురామ తనయుడు భరత్ కు అపాయింట్ మెంట్ దొరికిందని…ఇపుడు రాజుగారు డైరెక్ట్ గా సీన్ లోకి ఎంటరయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నపుడే రాజుగారు …జగన్ పై వార్ ఆపలేదని, ఇక నేరుగా హస్తినాపురికి చేరుకున్నాక జగన్ కు తిప్పలు తప్పవని అంటున్నారు. ఏది ఏమైనా…జగన్ ను ఇరకాటంలో పెట్టేలా ఆర్ఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తారని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.
ఈ కష్ట సమయం లో నాకు తోడుగా, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ????????
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) May 26, 2021