టీడీపీ అభ్యర్థి గెలిచారని సంబంధిత ఎన్నికల అధికారులే ప్రకటించారు. దాదాపు 7 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఆయన విజయం దక్కించుకున్నారని కూడా చెప్పారు. మరి ఆయనకు గెలిచినట్టుగా.. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ.. డిక్లరేషన్ ఇవ్వాలి కదా! కానీ, ఇవ్వలేదు. ఇక్కడే వైసీపీ రాజకీయాలు చోటు చేసుకున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. తనకు డిక్లరేషన్ ఇవ్వాలని కోరిన టీడీపీ అభ్యర్థి సహా.. ఇతర నేతలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకు వెళ్లి అరెస్టు చేశారు.
విషయం ఏంటంటే.. ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడప పరిధిలోని పశ్చిమ రాయలసీమ కు చెందిన కడప-అనంతపురం-కర్నూలు నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం దక్కించుకున్నారని అధికారులు ప్రకటించారు. తొలి, మలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఇక్కడ అధికార పార్టీ వైసీపీఅభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డికి మధ్య హోరా హోరీ పోరు సాగింది.
ఈ పోరులో టీడీపీ అభ్యర్థి 7,543 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికా రిగా ఉన్న అనంతపురం కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటించారు. అయితే.. ఇక్కడ బండెల్స్ను లెక్కించడంలో తేడా జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. అయితే.. సాక్షాత్తూ కలెక్టరే ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. అంతా బాగానే జరిగింది.. రాజకీయం చేయొద్దని వ్యాఖ్యానించారు. అయతే.. ఇంతలోనే ఆమె యూటర్న్ తీసుకున్నారు.
భూమిరెడ్డి గెలిచారని.. ప్రకటించి.. గంటలు గడుస్తున్నా.. శనివారం రాత్రి 12 గంటల సమయం మించిపోతున్నా.. ఎంతకి డిక్లరేషన్ ఇవ్వలేదు. వాస్తవానికి గెలుపు ప్రకటన వెలువడిన గంటలోనే అన్నీ సరిచూసుకుని.. డిక్లరేషన్ ఇచ్చారు.(ఇతర చోట్ల అలానేజరిగింది) కానీ, ఇక్కడ మాత్రం కలెక్టర్ మౌనం వహించారు. దీంతో టీడీపీ నేతలు ఏదో జరిగిందని.. వైసీపీ ఒత్తిళ్లకుఅ ధికారులు లొంగిపోయారని అనుమానించి ఆందోళనకు దిగారు. దీంతో అభ్యర్థి భూమి రెడ్డి సహా.. అందరినీ పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి అరెస్టు చేశారు. ఇదీ.. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం.. అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
జగన్ పని అయిపోయింది అని official గా declare చేసిన రాయలసీమ వెస్ట్ MLC ఎలక్షన్స్
దీని పైన పుంగునురు పుడింగి కామెంట్స్ ఎంటి వేచి చూడాలి. pic.twitter.com/x6DreGUOiz
— PKC ???? (@pavan_chowdarii) March 18, 2023