భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరు? అన్న ప్రశ్న వేసినంతనే.. పిచ్చి నవ్వు నవ్వి.. ఈ మాత్రం తెలీదా? అంటూ పేర్లు చెప్పేయటం ఖాయం. కానీ.. మీరు చెప్పే పేర్లలో ఏ ఒక్కటి కరెక్టు కాదు. అదెలా.. అంటారా? నిజమే.. దేశంలో అత్యంత సంపన్న క్రికెటర్ జాబితాలో చేరారు అర్యమన్ బిర్లా. ఇతనెవరు? ఎప్పుడు ఆ పేరు వినలేదనుకుంటున్నారా? నిజమే.. అతని పేరు క్రికెట్ ను పిచ్చి పిచ్చిగా ఫాలో అయ్యే వారు మాత్రమే చెప్పగలరు.
ఎందుకంటే.. ఈ యువ క్రికెటర్ ప్రస్తుతం దేశవాళి క్రికెట్ లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటికైతే మధ్యప్రదేశ్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న ఇతను.. మూడేళ్ల క్రితం ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతడ్ని రూ.31 లక్షలకు కొనుగోలు చేసింది. మరి.. అలాంటి ఆర్యమన్ ఎలా సంపన్న క్రికెటర్ ఎలా అవుతారు? అంటారా? అక్కడికే వస్తున్నాం.
ఎందుకంటే ఆర్యమన్ బిర్లా.. వ్యాపార దిగ్గజం కుమార్ మంగళం బిర్లా కుమారుడు కావటమే దీనికి కారణం. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే.. కుమార మంగళం బిర్లా ఆస్తుల విలువ రూ.70వేల కోట్లు. త్వరలో అతను బిర్లా వ్యాపార సామ్రాజ్యానికిఈ యువ క్రికెటర్ అధిపతి కానున్నారు.
ఈ లెక్కన చూస్తే.. దేశంలోనే అత్యంత సంపన్న క్రికెటర్ గా ఇతనే నిలుస్తారు. 23 ఏళ్ల ఆర్యమన్ కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే మహా ఇష్టం. అంతర్జాతీయ క్రికెట్ లో పేరు తెచ్చుకోవాలన్నది అతని కల.
అందుకోసం నిత్యం విపరీతంగా కష్టపడుతుంటారు. అంతర్జాతీయ క్రికెటర్ల జాబితాలో తన పేరు చూసుకోవాలన్నది అతని కోరిక. ఇందుకోసం.. అతను తీవ్రంగా శ్రమిస్తుంటాడు. ఏడమ చేతి వాటం కలిగిన బౌలర్ గా.. బ్యాట్స్ మన్ గా ఇతను ఇప్పటికే రాణిస్తున్నాడు. మరి.. అతను కోరుకున్నట్లుగా అంతర్జాతీయ క్రికెటర్ల పేర్ల జాబితాలో ఆర్యమన్ పేరు ఉంటుందా? ఉండదా? అన్నది కాలమే నిర్ణయించాలి.