ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `కల్కి 2898 ఏడీ` గత నెల 27న గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ హీరోగా నటించాడు. అలాగే దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ప్రధాన పాత్రలను పోషించారు.
భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన కల్కి.. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చిత్తు చేసింది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా కల్కి మూవీలో దీపికా పదుకొనే పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
సినిమాలో ల్యాబ్ సబ్జెక్ట్ అయిన SUM-80 అలియాస్ సుమతి పాత్రలో దీపికా యాక్టింగ్ చేసింది. ఆమెకు పుట్టబోయే బిడ్డ కల్కిని రక్షించే లక్ష్యం నేపథ్యంలో కథ మొత్తం సాగుతుంది. ప్రెగ్నెంట్ లేడీగా ఎమోషనల్ పాత్రలో దీపికా తెరపై మ్యాజిక్ క్రియేట్ చేసింది. అయితే కల్కి మూవీలో సుమతి పాత్రకు ఫస్ట్ ఛాయిస్ దీపికా కాదనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది
డైరెక్టర్ నాగ్ అశ్విన్ మొదట ఆ క్యారెక్టర్ కోసం టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను తీసుకోవాలని భావించారట. కానీ అంతకు ముందే ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధే శ్యామ్ వచ్చి పరాజయం పాలైంది. దానికి తోడు పూజా హెగ్డే వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేయించుకుంది. ఈ నేపథ్యంలోనే సుమతి పాత్రకు పూజాను తీసుకోవాలనే ఆలోచనను మేకర్స్ విరమించుకున్నారట. ఫైనల్ గా దీపికా పదుకొనేను ఎంపిక చేయడం జరిగిందట.