ఈ క్రింది వార్తలన్నీ ఒకదానికొకటి పూర్తిగా ఆధారపడి ఉన్నాయి.. అని చెప్పలేకపోయినా వాటి మధ్య ఎక్కడైనా బలమైన సంభంధం ఉండి ఉండవచ్చు.
Criminals only can save and create Criminals
నేరస్తులు మాత్రమే నేరస్తులను రక్షించ గలరు, కొత్త నేరస్తులను తయారుచేయగలరు
వార్త 1:
జగన్ రెడ్డి గారు బీజేపీ అగ్రనాయకత్వంతో గత కొన్ని రోజులుగా పదేపదే ఢిల్లీలో సమావేశమయ్యారు.
వార్త 2:
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగొయ్ గారు ఉన్న సమయాన.. గుజరాత్ రాష్ట్ర హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తి గారైన MR షా గారిని సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ప్రపోజ్ చేశారు.
వార్త 3:
CBI ఎస్పీ రాంసింగ్ విచారణ చేస్తున్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ జాప్యం జరుగుతోందంటూ నిందితుల తరుపున సుప్రీంకోర్టులో కేసు వేయటం అది జస్టిస్ MR షా గారి ధర్మాసనం ముందుకు వెళ్ళటం జరిగింది.
వార్త 4:
రంజన్ గొగొయ్ గారు రిటైర్ అయిన వెంటనే రోజుల వ్యవధిలో బీజేపీ ద్వారా రాజ్యసభ సభ్యులు అయ్యారు.
వార్త 5:
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు అరెస్ట్ కావటం తథ్యం అని తెలంగాణ హైకోర్టులో సీబీఐ ఎస్పీ రాంసింగ్ కుండబద్దలు కొట్టారు. నిందితులేమో విచారణకు సహకరించకుండా వాయిదాలు అడుగుతూ ఉన్నారు.
వార్త 6:
విచారణ త్వరగా అవ్వాలని.. అప్డేట్స్ ఏంటి అంటూ రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టు CBI అడగటం.. అలాగే అదే విచారణాధికారిని కొనసాగిస్తారా.. మారుస్తారా.. మరొక అధికారిని జత చేస్తారా అంటూ ప్రశ్నించింది MR షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.
వార్త 7:
అదే అధికారిని కొనసాగిస్తామని.. వేగవంతం చేసేందుకు మరొక పెద్ద అధికారిని సైతం జతపరుస్తామని CBI చెప్పటం జరిగింది.
వార్త 8:
మరొక అధికారిని నియమించాక.. ఇంక ఈ పాత అధికారిని ఎందుకు కొనసాగిస్తున్నారంటూ మళ్ళీ ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దాంతో తప్పనిసరి? పరిస్థితుల్లో రాంసింగ్ ను వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ నుంచి తప్పించారు.
వార్త 9:
మరోసారి జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి.. బీజేపీలోని మోదీ/అమిత్ షాలను కలిసి.. గంటల తరబడి చర్చలు జరిపారు.
నేరస్తులు మాత్రమే నేరస్తులను రక్షించ గలరు, కొత్త నేరస్తులను తయారుచేయగలరు
ధర్మం గెలుస్తుందా? సత్య దేవత తక్కెడ ఒక పక్కకు ఒరిగి పోకుండా ఉంటుందా? లేదా పై వాడు, పక్కవాడు, ఇక్కడి వాడు అనుకున్నట్లే జరుగుతుందా? ఆంధ్రుల ఖర్మ ఎలా రాసి పెట్టి ఉంటే అలానే జరుగుతుంది. కాలమే సమాధానం చెప్పే రోజులు పోయాయి. ప్రజలు ఏ ఆశతో ఓటు వేశారో అవే జరుగుతున్నాయి.