• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రామోజీరావు కు సీఐడీ అధికారుల షాక్

admin by admin
April 3, 2023
in Andhra, Politics, Telangana, Trending
0
0
SHARES
564
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ ఆ సంస్థ ఛైర్మన్, ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో నిబంధనలకు విరుద్ధంగా చిట్స్ వేశారని, ఆ కంపెనీలో అక్రమాలు అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రామోజీరావుతో పాటు ఆయన కోడలు శైలజా కిరణ్ కు ఏపీ సిఐడి అధికారులు కొద్దిరోజుల క్రితం సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీ చేశారు.

మోసం చేయడం, డిపాజిట్లను మ్యూచువల్ ఫండ్స్ లోకి దారి మళ్ళించడం, క్యాపిటల్ మార్కెట్లో నష్టాలు, చిట్ ఫండ్ బిజినెస్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై ఈ నోటీసులను అధికారులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 3 లేదా 6 తేదీల్లో వారి నివాసం లేదా కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సిఐడి అధికారులు కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు జూబ్లీహిల్స్ లోని శైలజా కిరణ్ నివాసానికి ఏపీ సీఐడీ అధికారుల బృందం విచారణ జరిపేందుకు వచ్చింది.

దాదాపు 200 మంది అధికారులు విచారణ జరిపేందుకు వచ్చారు. విచారణకు హాజరయ్యేందుకు రామోజీ రావు కూడా శైలజా కిరణ్ ఇంటికి వచ్చారు. దీంతో, భారీ భద్రత నడుమ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఏ1గా మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్ లను అధికారులు పేర్కొన్నారు. దాంతోపాటు మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచ్ మేనేజర్లు పలువురిపై కూడా కేసులు నమోదు చేశారు.

కొద్ది రోజుల ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు, మేనేజర్ల ఇళ్లపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సోదాలు చేసింది.ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1999, చిట్ ఫండ్ యాక్ట్ 1982లను ఉల్లంఘించిన ఆరోపణలపై మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మార్చి 12న ఆంధ్రప్రదేశ్‌లోని మార్గదర్శి శాఖలపై దాడులు నిర్వహించిన అధికారులు నలుగురిని అరెస్టు చేశారు.

Tags: AP CIDenquirymargadarsi chitsRamoji raosailaja kiran
Previous Post

37 ఏళ్ల తర్వాత మళ్లీ జ‘మ’ జ‘చ్చ’ జంట రచ్చ

Next Post

ధర్మం గెలుస్తుందా?

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

ధర్మం గెలుస్తుందా?

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra