• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

“లేలేలే.. నా రాజా..“ వైసీపీ ఎమ్మెల్యే బ‌ర్త్‌డే వేడుక‌

admin by admin
August 4, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
348
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సాధార‌ణంగా పుట్టిన రోజు వేడుక అంటే.. అంతో ఇంతో ఊపు ఉత్సాహం కామ‌నే.అయితే.. ఎంతైనా.. మ‌రీ రికార్డింగుల‌తో అద‌ర‌గొట్టేయ‌రు క‌దా. అది కూడా.. ప‌బ్లిగ్గా!!  కానీ.. వైసీపీ ఎమ్మెల్యే మాత్రం త‌న పుట్టిన రోజు వేడుక‌ల్లో రికార్డింగులు డ్యాన్సులు.. అశ్లీల నృత్యాల‌తో అద‌ర‌గొట్టేశారు. ఆయ‌నే ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌. ఆయ‌న‌ బర్త్‌డే సందర్భంగా దర్శిలో మంగళవారం రాత్రి రికార్డింగ్‌ డ్యాన్స్‌లు వేశారు.

స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో మంగళవారం రాత్రి వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమంలో యువతులు వేదికపై రెచ్చిపోయి చిందేశారు. “లేలేలే.. నా రాజా..“ అంటూ.. ఓల్డ్ సాంగ్స్‌తో చిందేశారు. అంతేకాదు.. మ‌హాజ‌నానికి మ‌ర‌ద‌లు పిల్ల‌.. అంటూ.. కొంద‌రు ఆ యువ‌తుల‌ను ఉద్దేశించి కామెంట్లు చేయ‌డం కార్య‌క్ర‌మంలో మ‌రింత చ‌ర్చ‌గా మారింది.

ఈ డ్యాన్స్‌లను ఎమ్మెల్యే వేణుగోపాల్‌, ఇతర వైసీపీ నాయకులు స్టేజీ మీద కూర్చోని ఈల‌లు వేస్తూ.. గోల‌లు చేస్తూ.. మ‌రీ వీక్షించారు. ఎమ్మెల్యే బర్త్‌డే సందర్భంగా ఇలా పట్టణ నడిబొడ్డున రాకపోకలను నిలిపేసి రికార్డింగ్‌ డ్యాన్స్‌లు ఏర్పాటు చేయటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. అయినా.. అధికారం మాది.. ఆ మాత్రం ద‌ర్పం మాకుండ‌దా.. అని ఎమ్మెల్యే అనుచ‌రులు అంటున్నారు.

సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో అశ్లీలంగా నృత్యాలు చేయించడంతో పాటు కొందరు వైకాపా కార్యకర్తలు వారితో కలిసి నృత్యాలు చేశారు. 12 గంటలకు ఎమ్మెల్యే కేకు కోసిన అనంతరం ఈ నృత్యాలు సాగినా ఆయన వారించకపోవడం గమనార్హం. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ తతంగం సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం మ‌రింత చ‌ర్చ‌కు దారితీసింది.

Tags: darsi mla maddisetty venugopalrecording dance partyvulgar dance at birth dayycp mla's birth day
Previous Post

జగన్ కు ‘షాక్’ ఇచ్చేలా విద్యుత్ ఉద్యోగి స్పీచ్..వైరల్

Next Post

గోరంట్ల మాధవ్ వీడియోపై రఘురామ ‘నేక్డ్’ రివ్యూ

Related Posts

Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Load More
Next Post

గోరంట్ల మాధవ్ వీడియోపై రఘురామ ‘నేక్డ్’ రివ్యూ

Please login to join discussion

Latest News

  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra