విశ్వక్ సేన్ తెలుగు సినిమా ప్రామిసింగ్ నటులలో ఒకరు. ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో, vishwak sen విరామం లేకుండా పని చేస్తున్నాడు. అన్‌స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్‌కి విశ్వక్ సేన్ మరియు DJ Tilli ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ అతిధులుగా వచ్చారు.
విశ్వక్ సేన్ ఇటీవల తన జీవితంలో జరిగిన ఓ ఎమోషనల్ మూమెంట్ గురించి వెల్లడించారు. విశ్వక్ తన రాబోయే చిత్రం ధుమ్కీ షూటింగ్లో ఉన్నాడు. ఇందులో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తెలుగు సినిమా నిర్మాతలు నెల రోజుల పాటు సమ్మెకు పిలుపునివ్వడంతో సినిమా ఘోరంగా దెబ్బతింది. ఇది కాకుండా, సినిమా బడ్జెట్‌ను పెంచే అనేక ఘటనలు జరిగాయి. దీంతో ఖర్చు తడిసి మోపెడయ్యింది. అదే సమయంలో విశ్వక్ సేన్ సోదరి ఆస్పత్రి పాలయ్యింది. అప్పటికే సినిమా పరంగా తీవ్రమైన దు:ఖంలో ఉన్నపుడు ఆమెను ఐసీయూలో చేర్చడం పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది.
ఆ సమయంలో విశ్వక్ సేన్ నిద్రలేని రాత్రులు గడిపాడట. అతను రాత్రంతా ఆసుపత్రులలో గడపవలసి వచ్చిందట. మళ్లీ ఉదయాన్నే ధమ్కీ షూటింగ్‌కి హాజరయ్యేవాడినని విశ్వక్ సేన్ చెప్పాడు.
“బడ్జెట్ ఇప్పటికే ఎక్కువైంది. సినిమా ఆపలేను. చెల్లెలిని విడిచిపోలేను. దీందో అటు చెల్లి, ఇటు సినిమా రెంటికీ హాజరు కావడం తప్ప నాకు వేరే మార్గం లేదు. మా తల్లిదండ్రులు మా చెల్లెలిని చూసుకున్నారు మరియు నేను రాత్రులు ఆసుపత్రిలో గడిపాను. మూడు గంటలపాటు నిద్రపోయి సెట్స్‌కి వెళ్లాల్సి వచ్చింది. షాట్ లాక్ అయిన తర్వాత, నేను ఏడ్చేవాన్ని. అవి నా జీవితంలో అత్యంత కష్టమైన రోజులు” అని విశ్వక్ సేన్ ఆ చీకటి రోజుల గురించి నందమూరి బాలయ్య అన్ స్టాపబుల్ లో చెప్పుకువచ్చారు. విశ్వక్ సినిమా ధమ్కీ త్వరలో విడుదల కానుంది.