ఖాకీ అన్నంతనే కరకు కట్టినోడన్న తప్పుడు అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అందరూ ఒకేలా ఉండరన్న మాటకు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. అనాథ శవాన్ని బాధ్యతగా మోసిన తీరు.. అందరి అభినందనల్ని అందుకునేలా చేస్తోంది. ఇంతకూ ఆ పని చేసిందెవరు. అసలేం జరిగింది? అన్న విషయంలోకి వెళితే..
విశాఖ జిల్లాలోని రాంబిల్లి మండలంలోని సీతపాలెం సముంద్ర తీరానికి ఒక అనాథ శవం కొట్టుకు వచ్చింది. దాన్ని చూసిన స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు కబురు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మరణించిన వ్యక్తిని గుర్తించేందుకు చుట్టుపక్కల గ్రామాలకు వారికి సమాచారం ఇచ్చినారు. కానీ.. ఎవరూ ఆ మరణించిన వ్యక్తితో సంబంధం లేదన్నారు.
సీతాపాలెం మారుమూల ప్రాంతం కావటం.. చనిపోయి మూడు రోజులు కావటంతో శవం చెడిపోయి దుర్వాసన వస్తోంది. మరింత.. ఆలస్యం చేస్తే ఇబ్బంది అవుతుందని భావించిన ఎస్ఐ అరుణ్ కిరణ్.. అక్కడినుంచి అనాథ శవాన్ని తరలించటానికి స్థానిక మత్స్య కారుల్ని.. కూలీల్ని సాయం కోరారు. కరోనా భయంతో ఎవరూ ముందుకు రావటానికి ఇష్టపడలేదు. దీంతో.. శవాన్ని అక్కడే వదిలేయటం ఇష్టం లేని ఎస్ఐ.. తాను.. తన పోలీసుల సిబ్బందితో కలిసి మూడు కి.మీ. మోసుకుంటూ తీసుకెళ్లారు. అవసరమైతే.. ఎలాంటి పనికైనా తాము సిద్దమన్నట్లుగా వ్యవహరించిన ఖాకీల కమిట్ మెంట్ ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారని చెప్పాలి.
Last rites to a lost soul: A dead body of an unidentified man washed up at the shore of Seetapalem. When no one came to claim the body for 3 days & the body started to rot, @VSPRuralPolice as a humane gesture carried him along the shore for 3 kms to perform his last rites. (1/2) pic.twitter.com/JfCAPk3Wso
— Andhra Pradesh Police (@APPOLICE100) March 28, 2021