నిజం
రేప్ జరగలేదు.
ఆమెకు ఆమే చున్నీ బిగించుకుని చనిపోయింది. బాబ్రీ మస్జిద్ ఎలా దానికదే కోలిపోయిందో మనీషా వాల్మీకి కూడా అలానే చనిపోయినట్లు చిత్రీకరించడానికి యోగి ప్రభుత్వం, పోలీసులు, వైద్యులు, గోదీ మీడియా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని ముక్తకంఠంతో ఖండించడం సగటు మనిషిగా మనందరి బాధ్యత మరియు కర్తవ్యం.
19 ఏళ్ల మనీషాని గ్యాంగ్ రేప్ చేశారు.మెడ విరిచి నాలుక కోసి, వెన్నుపూస విరిచి దేహమంతా రక్త గాయాలు. కౄర మృగాలు ఏవిధంగా తమ వేట జంతువులను చంపి తింటాయో, మనీషా వాల్మీకి యొక్క దుర్ఘటనే ఉదాహరణ.200 పైచిలుకు రక్తగాయాల చిట్టా పోస్ట్ మార్టం రిపోర్టు.
అలహాబాద్ హైకోర్టు ఈ కేసుని సుమోటోగా తీసుకున్నందుకు ఇప్పుడు నెత్తుటి కన్నీళ్ల సంతోషం. శవాన్ని తల్లిదండ్రులకి కూడా చూపకుండా కనీస అంతిమ సంస్కారాలు చేయకుండా, బాధితుల ఇళ్ల చుట్టూ బారికేడ్లు వేసి గ్యాంగ్ రేప్ బాధితురాలి శవాన్ని
ఊరి చివర పొలాల్లో అర్ధరాత్రి 3 గంటలకు దహనం చేసిన పోలీసులు.ఇవాళ
ఓ పోలీసు అధికారి రేప్ జరగలేదని ప్రెస్మీట్ పెట్టి చెప్పడం.
రేప్ కి చట్టం ఏమని నిర్వచనం ఇస్తుందో చూడండి
Referring to the Criminal (Amendment) Law 2013, the definition of rape had changed after the Nirbhaya case. “Penetration is not necessary to confirm sexual assault. Applying mouth or touching private parts were also classified as offenses of sexual assault.
పోనీ రేప్ జరగలేదు సరే ఈ కేసు SC/ST ( Prevention of Atrocities)Act కిందికి కూడా రాదా?
ఆధ్యాత్మిక వేత్తలు తలలు గజ్జల్లో దాపెట్టుకున్నారు.మోరల్స్ వల్లించే భాష్యకారులగోడ చాటున గంజాయిదమ్ము బిగిస్తున్నారు. పౌర సమాజం సమూహ ప్లేగ్ వ్యాధికి లోనై మృత్యునిద్ర నటిస్తోంది. బిడ్డ రక్తసిక్త దేహాన్ని ‘ చందా’పోలీసు స్టేషన్ కి తీసుకెళ్తే బయటకు నడవండి’ అని బెదిరింపు.
ఆస్పత్రికి తీసుకెళ్లి ఒక పూటంతా నొప్పులు భరిస్తూ ఎండలో వుంటే అప్పుడు అడ్మిషన్.
అప్పటికే పూర్తిగా రెండు కాళ్లకు పెరాలసిస్. ఆస్పత్రిలో పరీక్షలకి ముందే గాయాలు కడిగి, స్నానం చేయించి దుస్తులు మార్చారు. రేప్ బాధితురాలలో 72 గంటలలోపు మాత్రమే నిందితుల స్పెర్మ్ టోజువా గుర్తించడానికి వీలవుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ చేరిన 8 రోజుల తరువాత పరీక్షలు చేశారు.
Equality before Law
Equal Protection of the Law
రాజ్యాంగం దుక్కిస్తోంది.
ఉన్నత అధికారులు, పోలీసు ఉన్నత అధికారులు, వైద్యులు అంతా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి 4గురు ఠాకూర్ ఉన్మాదులని కాపాడటానికి.కేసు వాపస్ తీసుకోమని సాక్షాత్తు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పోలీసులు బాధితులకి ఫోన్లు చేసి బెదిరింపులు చేస్తారు.ఇవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అక్టోబరు 12న కోర్టు ముందుకు ఇవన్నీ వస్తాయా? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ సజావుగా కొనసాగుతుందా?
బాధితులని పరామర్శించడానికి వస్తే రాహుల్, ప్రియాంక ల డిటెన్షన్. Trunamul నేతల అడ్డగింత. ఢిల్లీలో భీమ్ ఆర్మీ ఆందోళన చేయకుండా 144 సెక్షన్ అమలు.
National Security Act మాట్లాడదు. లా మేకర్స్ మాట్లాడరు. ఎస్సి, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు మాట్లాడరు. ఫ్యూడల్ ఉన్మాద రేపిస్ట్లు 4గురు ఠాకూర్ లని కాపాడటానికి ప్రజాస్వామ్యం తలవంచుతోంది
నిజం
ఇంతకంటే బెటర్ చట్టాలు బ్రిటీష్ కాలం నాడు వున్నాయి.
ఇప్పుడు చెప్పండి
విరిగిన వెన్నెముక
తెగిపోయిన నాలుక మనీషాది మాత్రమేనా?