విరాట్ కోహ్లీ కెప్టెన్సీ విషయంలో కీలక నిర్ణయం ప్రకటించారు.
టీ20 జట్టు కెప్టెన్‌గా టీమిండియా సారథి విరాట్ కోహ్లి తప్పుకోనున్నారు.
టీ20 ప్రపంచ కప్ తర్వాత ఈ ఫార్మాట్ నుంచి వైదొలగనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ప్రకటన చేశారు.
‘‘ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నా. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నా. పని ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసున్నా’’ అని కోహ్లి ట్విటర్ వేదికగా వెల్లడించారు.
టెస్టు, వన్డే జట్లకు కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగనున్నారు.
టీ20 జట్టులో బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతానని కోహ్లి స్పష్టం చేశారు.
గంగూలీ, రవిశాస్త్రి, రోహిత్‌శర్మలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని విరాట్ వివరించారు.
కోహ్లీ వైదొలగిన తర్వాత టీ20 ఫార్మాట్‌కు రోహిత్‌శర్మ సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని క్రీడానిపుణులు భావిస్తున్నారు.