విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల బంధం గురించి పుకార్లు ఇప్పటివి కావు. ఇద్దరూ కలిసి ‘గీత గోవిందం’ సినిమా చేసినప్పటి నుంచి వీరి మధ్య ఏదో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా చేస్తున్న సమయానికి కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రేమలో ఉన్న రష్మిక.. తర్వాత అతడి నుంచి విడిపోవడంతో ఈ సందేహాలు బలపడ్డాయి. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో తెర మీద వీళ్లిద్దరి కెమిస్ట్రీ చూసి.. నిజంగా లవర్సే అన్న ఫీలింగ్ కలిగింది.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి నటించకపోయినా.. అనేక సందర్భాల్లో క్లోజ్‌గా కనిపించారు. ఇవన్నీ ఒకెత్తయితే.. గత ఏడాది చివర్లో ఇద్దరూ కలిసి మాల్దీవులకు విహార యత్రకు వెళ్లారనే ప్రచారం గట్టిగా జరిగింది. ఇద్దరూ కలిసి అక్కడున్న ఫొటోలేవీ బయటికి రాలేదు కానీ.. విజయ్, రష్మిక విడివిడిగా రిలీజ్ చేసిన ఫొటోలను పక్క పక్కన పెట్టి చూస్తే ఈ జంట మాల్దీవుల్లో కలిసి ఉందనే అనుమానాలు బలంగా కలిగాయి. దీంతో వీరి బంధం నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిందనే అభిప్రాయానికి వచ్చేశారంతా.
ఈ మాల్దీవుల వెకేషన్ చర్చ ముగిసిన కొన్ని రోజులకు ఇప్పుడు కొత్తగా బయటికి వచ్చిన వీడియో.. విజయ్, రష్మికల గురించి మళ్లీ చర్చకు తావిచ్చింది. ఆ వీడియోలో రష్మిక తన సోషల్ మీడియా ఫాలోవర్లతో చిట్ చాట్ చేస్తోంది. అభిమానుల ప్రశ్నలకు, కామెంట్లకు జవాబిస్తోంది. ఆ వీడియో మధ్యలో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించడం విశేషం. విజయ్ స్పష్టంగా ఏమన్నాడన్నది అర్థం కాలేదు కానీ.. నెటిజన్ల ప్రశ్నలను రష్మికకు చదివి వినిపిస్తున్నది అతనే అనిపిస్తోంది.
ఇంతకుముందు ఈ వీడియో లైవ్ అయినపుడు జనాలు ఈ విషయాన్ని గుర్తించినట్లున్నారు. లేటుగా విషయం గ్రహించి ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తున్నారు. మొత్తానికి గత ఏడాది చివర్లో విజయ్, రష్మిక కలిసి మాల్దీవుల టూర్ వేసిన విషయం అయితే స్పస్టంగా తెలిసిపోతోంది. విజయ్, రష్మిక తమ బంధం గురించి ఓపెన్ కానప్పటికీ.. పరోక్షంగా తాము రిలేషన్షిప్లో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నట్లే కనిపిస్తోంది ఇటీవలి పరిణామాలు చూస్తే.