తెలుగు రాష్ట్రంలో ఇప్పటికీ నిఖార్సైన దమ్మున్న మీడియా ఏదైనా ఉందంటే అది ఆర్కే ఆధ్వర్యంలోని ఆంధ్రజ్యోతి అని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ వ్యాపారాలు చేయని మీడియా అధిపతి ఆయన ఒక్కరే కాబట్టి… ఆ తెగువ ఆయనకు ఉంది. ఇక మిగతా అన్ని మీడియాల యజమానులు ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉన్నారు. అందుకే రాధాక్రిష్ట వంటి తెగువను ఆ మీడియాలో చూపలేకపోతున్నారు.
ఇక రాజకీయ రహస్యాలను నిత్యం అందరికంటే ముందే ప్రజల ముందు ఉంచే రాధాక్రిష్ట తాజాగా ఏపీ రాజకీయాలపై రాసిన కొత్త పలుకులో కొన్ని ముఖ్యమైన పాయింట్లు రాశారు. అవేంటో చూద్దాం.
- స్వర్గీయ ఎన్టీరామారావు ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీని ప్రకటించారో గానీ ఈ నలభై ఏళ్లలో ఆ పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది.
- ఇంతకాలంగా చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపిస్తూ వచ్చిన జగన్ అండ్ కో ఇప్పుడు తాను మాత్రం అదే పని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఫలితంగానే కాబోలు చంద్రబాబుకు న్యాయస్థానాలలో ఉపశమనం లభించడం లేదన్నది విస్తృతాభిప్రాయంగా ఉంది.
- న్యాయస్థానాల ఆదేశాలు ఎలా ఉండబోతున్నాయో కూడా వైసీపీ సోషల్ మీడియాలో ముందుగానే చెప్పేస్తున్నారు.
- పాలెగాళ్ల ఆలోచనలు వేరుగా ఉంటాయి. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతారు. ఆ తర్వాత జనాలను తమ అదుపులో పెట్టుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అదే. కులం, మతం పేరిట ఓటు బ్యాంకును ముందుగా సృష్టించుకున్న జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల పేరిట ప్రజలకు డబ్బు పంచుతూ ఓటు బ్యాంకును విస్తరించుకున్నారు.
-
రామోజీరావును మాత్రం అరెస్టు చేసి జైలుకు పంపాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ విషయంలో తనకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని జగన్ కోరడం కూడా జరిగింది. అయితే జగన్‌కు సహకరిస్తే రాజకీయంగా తనకు నష్టం జరుగుతుందని భావించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అభ్యర్థనను తిరస్కరించారు.
- ఏ మాత్రం అవకాశం చిక్కినా జనసేనానిని కూడా అరెస్టు చేయడానికి కాచుకొని ఉన్నారు. ఏదేమైనా ఎన్నికల వరకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు బయట తిరగకుండా జైలుకే పరిమితం చేసే అతి భయంకరమైన కుట్రను అమలు చేస్తున్నారు.
- సోషల్ మీడియాను ప్రయోగించి న్యాయ వ్యవస్థను భయభ్రాంతులకు గురిచేశారు. మొత్తానికి న్యాయ వ్యవస్థను కూడా పునరాలోచనలో పడవేయగలిగారు. గత కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం వల్లనే చంద్రబాబుకు రెండు వారాలు దాటినా ఉపశమనం దొరకకుండా పోయింది.
-
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన వారు లేరనడానికి అవినాశ్ రెడ్డి ఉదంతమే నిదర్శనం. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసి తీరుతామని ప్రకటించిన సీబీఐ అధికారులు ఆ పని చేయలేకపోయారంటేనే జగన్ శక్తియుక్తులు అర్థం చేసుకోవచ్చు.
- స్కిల్ కేసులో ఆధారాలు సేకరించాల్సి ఉందని చెబుతున్న సీఐడీ అధికారులు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని సునాయాసంగా అరెస్టు చేయగలిగారు. ఆధారాలు ఉండి కూడా సీబీఐ అధికారులు మాత్రం అవినాశ్ జోలికి పోలేకపోయారు.
- న్యాయ వ్యవస్థలో కూడా చంద్రబాబుకు లభించని ఉపశమనం అవినాశ్‌కు లభించింది. అంటే సీబీఐ అధికారుల కంటే రాష్ట్ర సీఐడీ అధికారులు సమర్థులు అని కాదు. ఇక్కడ కర్త, కర్మ, క్రియ జగన్మోహన్ రెడ్డి మాత్రమే.
-
బెయిల్‌పై ఉన్న ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవిని పూర్తిచేసుకుంటున్నారు. తాడూ బొంగరం లేని స్కిల్ కేసులో మాత్రం చంద్రబాబు జైల్లో ఉండాల్సిందే అంటున్నారు. ఇది కదా వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డీ!
- రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో జగన్ పార్టీ వ్యవహారాలను సాఫీగా జైలు నుంచే నడుపుకొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రతి కదలికనూ జగన్ ప్రభుత్వం వెయ్యి కళ్లతో పరిశీలిస్తున్నది.
- చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకోవడానికి అలవాటు పడినవారు ఇప్పుడిప్పుడే లోకేశ్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడుతున్నారు.
-
సంక్లిష్ట పరిస్థితిని కూడా ఎదుర్కోవడానికి భువనేశ్వరి, బ్రాహ్మణిని లోకేశ్ మానసికంగా సిద్ధం చేస్తున్నారు. తండ్రీ కొడుకులు జైల్లోనే ఉండవలసి వస్తే పార్టీ బాధ్యతలను చేపట్టడానికి బ్రాహ్మణి ఇప్పటికే సిద్ధపడ్డారు.
- షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఇంకో ఐదారు నెలల వ్యవధి ఉంటుంది. అప్పటి వరకు చంద్రబాబును జైలుకే పరిమితం చేయడం సాధ్యం కాకపోవచ్చు.
- ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెరిగినప్పుడు నాయకులు జైల్లో ఉన్నప్పటికీ ప్రజలు తాము ఇవ్వాలనుకున్న తీర్పునే ఇస్తారు. ఎమర్జెన్సీ సమయంలో జనతా పార్టీ తరఫున అనేక మంది నాయకులు జైళ్లలో ఉండే భారీ మెజారిటీతో గెలిచిన ఉదంతమే ఇందుకు నిదర్శనం.
Courtesy : Andhrajyothy