జనవరి 31వ తేదీన నార్వే మరియు 16 దేశాల ప్రవాస తెలుగు వారి ఆధ్వర్యం లో ‘ వీధి అరుగు ‘ అనే అంతర్జాల చర్చా వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గం .లకు మొదలయ్యి 8 గం .లకు ముగిసినది .
ప్రారంభోత్సవ సభకు నార్వే లోని భారత రాయబారి శ్రీ బాలభాస్కర్ గారు మరియు ప్రముఖ అవధాని, ప్రవచనకర్త శ్రీ గరికిపాటి నరసింహారావు గారు ప్రసంగించారు.
దృశ్య, శ్రవణ పద్ధతులతో వీధి అరుగు విశిష్టతను తెలియజేస్తూ కార్యక్రమమును ప్రారంభించడం జరిగింది. నార్వే లోని భారత రాయభారి Dr బి. బాలభాస్కర్ గారు ప్రారంభోపన్యాసం చేశారు. సభను ఉద్దేశిస్తూ “తెలుగు భాష సంస్కృతి లో ఒక ప్రముఖ స్థానం ఉన్నటువంటి వీధి అరుగు కార్యక్రమంను ప్రారంభించడం అనేది ఒక గొప్ప ఆలోచన. ఈ వీధి అరుగు ద్వారా బాషా మరియు విజ్ఞాన్ని ముందు తరాల వారికి అందిస్తారని ఆశిస్తున్నాను” అంటూ ప్రసంగించారు.
మహా అభ్యుదయ వాది, సుమారు ౩౦౦ అవధానాలు చేసిన ఘనాపాటి శ్రీ గరికపాటి నరసింహరావు గారి ఉపన్యాసం శ్రోతలను అందరిని ఎంతో ఆకట్టుకుంది. వీధి అరుగు విశిష్టత, నార్వే లోని శాంతమయ జీవితం, జీవిత పరమార్ధం, పిత్రువర్యులు యొక్క గొప్పతనము, ప్రపంచ పటంలో తెలుగు వాడి స్థానం, తెలుగు భాష గొప్పదనం, తెలుగు చరిత్రలోని ముఖ్యులు జీవితాలు నుండి నేర్చుకోవలసిన జీవిత సత్యాలు ఇలా ఎన్నో అంశాలుతో ప్రసంగం సాగింది.
ఈ కార్యక్రమమును నిబద్దతో నిరంతరం కొనసాగిస్తాము అని నిర్వాహకులు సభాముఖంగా తెలియచేస్తూ వందన సమర్పణ చేసారు.