వనిత విజయ్ కమార్ గురించి చాలామందికి బాగానే తెలుసు
ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె ఆమె
దేవి సినిమాలో నటించింది. ఇంకా పలు తెలుగు సినిమాలు చేసింది.
అయితే అందరూ ఆమెపై ఒక సెటైర్ వేస్తారు…. ‘వనిత చేసిన సినిమాల కంటే చేసుకున్న పెళ్లిళ్లే ఎక్కువేమో‘‘ అని.
అయితే ఇలాంటి వాటిని ఆమె పట్టించుకోదు.
ఆమె గురించి మేము రాసిన పాత ఆర్టికల్ చదవండి
తాజాగా ఈ వనిత విజయ్ కుమార్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
టాలీవుడ్ జంట సమంత, నాగ చైతన్య విడిపోయిన నేపథ్యంలో సమంతకు సలహాలు ఇచ్చిందీవిడ.
సమంతకు తాను మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేసింది.
సమాజం అనేది అవాస్తవమట. దాన్ని సమంత పట్టించుకోవాల్సిన అవసరం లేదట.
ఇవి వనితా విజయ్ కుమార్ మాటలు.
సమంత తన బతుకు తాను బతకాలని, జీవితం అనేది చాలా విలువైందని వనిత సలహా ఇచ్చింది.
జరిగే ప్రతి దానికి ఓ కారణం ఉంటుందని, అన్నింటినీ జీర్ణించుకుంటూ సమంత ధైర్యంగా ముందుకెళ్లాలని ఆమె సూచించింది.
సమంతకు మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నట్లు వనిత విజయ్ కుమార్ పేర్కొంది.
ఆ మహా వనిత మరిన్ని ఫొటోలు ఇక్కడ చూడొచ్చు