తెలుగుదేశం గొప్ప పార్టీ .. నేనెప్పుడూ పార్టీని తిట్టలేదు వైసీపీ కి మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశి వ్యాఖ్యానించారు.
గెలిచిన కొద్దిరోజులకే ఆయన టీడీపీని వదిలేసి చంద్రబాబును, ఆయన కుమారుడిని తిట్టిన విషయం తెలిసిందే.
మధ్యలో నారా భువనేశ్వరిని కూడా లాగి అవమానించిన వారిలో ఒకడు.
ఆయనకు వైసీపీ నేతలకు అస్సలు పడటం లేదు. సర్దుకుపోదామని రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు
దీంతో అతను దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.
ఈరోజు క్రికెట్ పోటీ ప్రోగ్రాంకి వచ్చి వేదికపై టీడీపీ పార్టీని పొగిడాడు.
అయినా చంద్రబాబును తిట్టి టీడీపీని పొగడటం వల్ల ఏం ఉపయోగమో తెలియదు
లోకేష్ విధానాల వల్ల పార్టీ నాశనం అయిందని మాత్రమే అన్నానని పార్టీని ఎపుడూ తిట్టలేదని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ ఇచ్చినా గెలవడని జగన్ కి అర్థం కావడంతో అక్కడ స్థానం లేకుండాపోయింది
అలాగని టీడీపీలో టిక్కెట్ రాదు. కనీసం ఇపుడు పొగడటం మొదలుపెడితే అధికారంలోకి వచ్చాక తనను ఏమీ అనకుండా ఉంటారన్న ఆశతో ఇలా మాట్లాడుతున్నాడని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు.
కానీ అందరు నానిలపై వంశీపై టీడీపీ క్యాడర్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బాబు వదిలిపెడతారేమో గాని వారు వదిలిపెట్టరు.
https://twitter.com/Deepika_NCBN/status/1530944076022853632