• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తమిళనాడులో మందుబాబులకు వ్యాక్సిన్ చిక్కులు

తమిళనాడులోని నీలగిరిలో వ్యాక్సిన్ వేయించుకున్నవారికే మద్యం అమ్మకం

admin by admin
September 3, 2021
in India, Politics, Top Stories
0
0
SHARES
135
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మన దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ రూపంలో కోరలు చాస్తుండడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో కీలకంగా మారింది. కొన్ని దేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే. కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటేనే కాలేజీల్లోకి అనుమతించే దిశగా తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇలా, అనేక చోట్ల వ్యాక్సిన్ వేయించుకున్న వారికి మాత్రమే అనుమతినిస్తున్నారు.

అయితే, పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా ఇదే తరహాలో వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఓ చోటికి అనుమతిస్తామంటోది అక్కడి సర్కార్. అయితే, అదే కాలేజో, మరో కీలక ప్రదేశమో అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇకపై, వ్యాక్సిన్ వేయించుకున్న వారికే మద్యం అమ్మాలని నీలగిరి జిల్లా అధికారులు నిర్ణయించడం సంచలనం రేపింది. ఆధార్‌ కార్డు, కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు సర్టిఫికెట్‌ చూపిస్తేనే మద్యం కొనే అవకాశముంటుందని ఆదేశాలు జారీ అయ్యాయి.

మందు బాబుల కిక్కు దిగేలా స్టాలిన్ సర్కార్ తీసుకున్న షాకింగ్‌ నిర్ణయం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కరోనాను కట్డడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నీలగిరి జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి నీలగిరి జిల్లాలో అమలవుతున్న ఈ షాకింగ్ పైలట్ ప్రాజెక్టును త్వరలోనే తమిళనాడులోని మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాలన్న యోచనలో సీఎం స్టాలిన్ ఉన్నారట. దీంతో, మందుబాబులంతా వ్యాక్సినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారట.

నీలగిరి జిల్లాలో 76 మద్యం షాపుల్లో రోజూ రూ.కోటి విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయి. అక్కడ 18 ఏళ్లకు పైబడినవారు 5.82 లక్షల మంది ఉండగా ఇప్పటికే 70 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఆ మిగతా 30 శాతం జనం కూడా వ్యాక్సిన్ వేయించుకోలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, దాంతోపాటు కరోనా కట్టడికి కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి, పొరుగు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటే మందుబాబులకు చిక్కులు తప్పేలా లేవు.

Tags: covid-19 vaccinationnilagiri districttamilandu governmentvaccine mandatory to buy liquor
Previous Post

ఈడీ విచారణకు రకుల్…ఆమెను ఇరికించిందెవరు?

Next Post

Pooja Hegde : స్పోర్ట్స్ బ్రాలో జిమ్ లో చెమటలు కక్కిన భామ

Related Posts

Top Stories

జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్

January 31, 2023
Trending

నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి

January 31, 2023
Trending

బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?

January 31, 2023
Trending

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

January 31, 2023
Top Stories

కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి భారీ దెబ్బ ఇదే

January 31, 2023
Trending

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

January 31, 2023
Load More
Next Post

Pooja Hegde : స్పోర్ట్స్ బ్రాలో జిమ్ లో చెమటలు కక్కిన భామ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !
  • కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి భారీ దెబ్బ ఇదే
  • ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!
  • జగన్ ఢిల్లీ టూర్… అనేక వెర్షన్లు !
  • జగన్ ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్..లోకేశ్ పై సెటైర్ కి రిటార్ట్
  • ప్ర‌జ‌ల జ‌గ‌న్ కాదు.. `ప‌ర‌దాల` జ‌గ‌న్!
  • ఇదేంది జగనన్నా .. ఇలా జ‌రిగింది?
  • అదానీని ఇంకోసారి ఏకిపడేసిన హిండెన్‌బ‌ర్గ్
  • య‌ల‌మంచిలిలో `అన్నా క్యాంటీన్‌` ఏర్పాటుకు ఎన్నారై టీడీపీ విత‌ర‌ణ‌
  • తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్
  • పట్టాభికి వల్లభనేని వంశీ షాక్
  • పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra