అవినీతి ఆరోపణలతో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి ఆ రాష్ట్ర హైకోర్టు.
దీంతో ముఖ్యమంత్రి పదవికి రావత్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.ఓ కేసులో రావత్‌పై అవినీతి ఆరోపణలతో సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
‘రాష్ట్రంలో అవినీతిని నిరోధించడంలో ముఖ్యమంత్రి విఫమయ్యారు. ఇలాంటి ఉత్తర్వులు వచ్చిన తర్వాత సీఎం పదవిలో ఒక్క నిమిషం కూడా కొనసాగే అర్హతలేదు’ అని కాంగ్రెస్ర రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ ధ్వజమెత్తారు.రాష్ట్ర గవర్నర్ బేబి రాణి మౌర్యను కలిసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతామని ప్రీతమ్ సింగ్ అన్నారు.హైకోర్డు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా సీబీఐ దర్యాప్తు జరగాలంటే రావత్ వెంటనే పదవి నుంచి వైదొలగాలని కాంగ్రెస్ నేతలు కోరారు.
మరోవైుపు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర భాజపా నేతలు తెలిపారు.