బిడ్డలు కలలకు ప్రతి రూపాలు అని అంటారు.బిడ్డలు రేపటి కాలం నిర్ణేతలు కూడా! అంటుంటారు. కానీ ఎప్పటి నుంచో భారతీయ సమాజంలో బిడ్డలు వద్దనుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఆ కోవలో కొన్ని ప్రశ్నలే ఎదురవుతున్నాయి. బిడ్డలు కావాలనుకున్నా, వద్దనుకున్నా అది వారి ఛాయిస్ గానే భావించడం లేదు చాలా మంది.
ఇదే సందర్భంలో బిడ్డలు కనండి అనే ఒత్తిడి కూడా ఇటీవల పెరుగుతోంది. లివ్ ఇన్ రిలేషన్లలో కూడా ఇలాంటి వి వాదాలే కదా నడుస్తున్నాయి. ఇదే సందర్భంలో ఉపాసన కామినేని (రామ్ చరణ్ భార్య, అపోలో సంస్థల అధినేత) డౌట్ ను అడుతుంటుంటారు నెటిజన్స్.. ఆమె నవ్వుతూ ఆన్సర్ ను స్కిప్ చేస్తుంటారు. కానీ ఇదే ప్రశ్నకు సద్గురువు అయితే ఎలా సమాధానం ఇచ్చారు. ఏ విధంగా కన్విన్స్ చేశారు.
అమెరికా తెలుగు అసోసియేషన్ ఆట నేతృత్వంలో అక్కడ 17 వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ వేడుకులకు సంబంధించి ఆసక్తిదాయక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పిల్లలు కనడంపై అక్కడి అతిథిగా ఉన్న ఉపాసన కామినేని సద్గురు జగ్గీవాసుదేవ్ ను ప్రశ్నించారు. తనను ఎప్పుడూ ఇదే విషయమై అడుగుతూ ఉంటారని చెబుతూ.. ఆయన ముందు రిలేషన్ (R), రీ ప్రొడ్యూస్ (R), రోల్ ఇన్ లైఫ్ (R) గురించి ఓ ప్రశ్న ఉంచారు.
దీనికి సద్గురు ఆసక్తిదాయక సమాధానమే ఇచ్చారు. బిడ్డలు కనవద్దనే చెబుతాను.. వేరే ఆలోచనలు ఉన్న వారే బిడ్డలను కంటుంటారు. ‘‘పిల్లల్ని కనకుండా ఉండే వారందరికీ నేను అవార్డు ఇస్తాను. జీవితంలో పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఈ తరం వాళ్లు అలా ఉంటే నేను అవార్డు ఇస్తాను’’ అని చెప్పారాయన. నువ్వు ఆడపులివి అయితే కనమనే చెప్పేవాణ్ని.. ఎందుకంటే పులులు అంతరించిపోతున్న జాతికి చెందిన జాబితాలో ఉన్నాయి కనుక.
పని ఉంటే ఆ హర్మోన్లు కలగవు. వేరే ఆలోచనలు ఉంటేనే పిల్లలు పుట్టించాలన్న ఆలోచన ఒకటి కలుగుతుంది. పని లేని వాళ్లందరికీ ఆ హార్మోన్లు ఆగవు అంటూ సద్గురు సమాధానం ఇచ్చారు.. మీరు ఇలా అంటే మా అమ్మ, అత్తమ్మ దగ్గర నుంచి మీకు ఫోన్లు వస్తాయి అని ఉపాసన అన్నారు. వస్తే రాని వాటికి కూడా కౌంటర్లు ఇవ్వగలను అని సద్దురు చెప్పారు.
Comments 1