కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2019 మే 30 నుంచి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న నిర్మలమ్మ వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టడం విశేషం. అలాగే ఈ వార్షిక బడ్జెట్ లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వారాల జల్లు కురిపించింది.
ఇకపోతే బడ్జెట్ సందర్భంగా నిర్మలమ్మ ప్రకటించిన పన్ను మినహాయింపులు.. ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులు పలు వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయి. కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ తో దేశంలో కొన్ని వస్తువులు ధరలు తగ్గపోతున్నాయి. బంగారం, వెండితో చేసిన ఆభరణాల ధరలు తగ్గనున్నట్లు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి తెలిపారు. బంగారం, వెండిలపై దిగుమతి సుంకాలు 6 శాతానికి తగ్గించారు. దీంతో ధరలు గణనీయంగా తగ్గబోతున్నాయి.
మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను తక్కువ ధరకు అందజేస్తామని ప్రకటించారు. ఇవే కాకుండా సీఫుడ్, లెదర్ తో చేసిన వస్తువులు, చెప్పులు, దుస్తులు, షూస్, బ్యాగ్స్, ఆర్టిఫిషియల్స్ వజ్రాలు, బొమ్మల ధరలు తగ్గనున్నాయి. అలాగే మరో మూడు క్యాన్సర్ చికిత్సకు అవసరం అయ్యే ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తొలగించింది. ఎక్స్రే మిషన్లపై జీఎస్టీ తగ్గింపు ప్రకటించింది. దీంతో మందులు, వైద్య పరికాల ధరలు కూడా తగ్గనున్నాయి. ఇక అమ్మోనియం నైట్రేట్, బయోడిగ్రేడబుల్ సాధ్యంకాని ప్లాస్టిక్, టెలికం పరికరాలు, సిగరెట్, ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.