రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం భారత్ మీద డైరెక్టుగా పడుతోంది. ఎలాగంటే ఉక్రెయిన్లో భారత విద్యార్థులు సుమారు 25 వేల మంది చదువుకుంటున్నారు. వీరు కాకుండా ఉద్యోగ, వ్యాపార, వృత్తుల్లో మరో 5 వేలమందున్నారట. అంటే మొత్తం 30 వేలమంది భారతీయులు ఉక్రెయిన్లో ఉన్నారని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే ఉద్యోగ, ఉపాధి విషయంలో ఉన్న 5 వేలమందిని వదిలేస్తే మిగిలిన 25 వేల మంది విద్యార్ధులది పెద్ద సమస్యగా మారింది.
వేలమంది విద్యార్ధులను ఉక్రెయిన్ నుంచి భారత్ కు రప్పించడం ఎలాగో కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావటం లేదు. ఎందుకంటే బుధవారం నుండి దేశంలో ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రష్యా యుద్ధం మొదలు పెట్టింది. అంతకుముందు ఉక్రెయిన్ తన గగనతలంపై విమానాల రాకపోకలను నిషేధించేసింది. దాంతో పాటు దేశంలోని అన్ని విమానాశ్రయాలను నిరవధికంగా మూసేసింది. అంటే ఏ దేశం నుంచి ఉక్రెయిన్ కు విమానాలు వెళ్ళే అవకాశం లేదు.
దీంతో ఉక్రెయిన్ లో ఉండిపోయిన వేలాదిమంది విద్యార్థుల నుండి భారత్ లోని తల్లి, దండ్రులపై ఒత్తిడి పెరిగిపోతోంది. తమను ఎలాగైనా భారత్ కు తీసుకెళ్ళిపోవాలంటు అక్కడి విద్యార్థులు బతిమలాడుకుంటు ఏడుస్తున్న వీడియోలు దేశంలో వైరల్ గా మారాయి.
అవి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై బాగా ఒత్తిడిని పెంచేస్తున్నాయి. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే సమస్యంతా విద్యార్ధుల్లోనే ఉంది. ఎందుకంటే యుద్ధం మొదలయ్యే సూచనలు కనబడగానే భారత్ కు తిరిగొచ్చేయమని కేంద్ర ప్రభుత్వం అక్కడి విద్యార్ధులను కోరింది. ప్రత్యేక విమానాలు వేస్తాం వచ్చేయమని చెప్పింది.
అయితే అప్పట్లో విద్యార్థులు ఎవరు దాన్ని లెక్కచేయలేదు. ఉక్రెయిన్లో తాము బాగానే ఉన్నామని, తమకేమీ సమస్యలు లేవని వీడియోలు పోస్టు చేశారు. తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని పదే పదే వీడియోల్లో చెప్పారు. తీరా ఇపుడు యుద్ధం మొదలైపోయిన తర్వాత తమను తీసుకెళ్ళాలంటు ఏడుస్తు నానా గోల చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు ముందే మాట వినుంటే ఇపుడీ సమస్యలే ఉండేవి కావు. ప్రభుత్వం మాట విని 240 మంది విద్యార్ధులు మాత్రమే దేశానికి తిరిగొచ్చారు.
ఇపుడు యుద్ధం మొదలైపోయింది కాబట్టి ఏ విధంగా వేలాది మంది విద్యార్ధులను తీసుకు రావాలన్నా కష్టమే. ఉక్రెయిన్ నుండి పక్కనే ఉన్న పోలాండ్ కు తరలించి భారత్ కు తీసుకు రావాలన్నా కష్టమే. ఎందుకంటే యుద్ధం మొదలవ్వగానే పోలాండ్ తన సరిహద్దులను మూసేసింది.
పైగా రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తో పోలాండ్ కూడా కలిసే అవకాశముంది. దాంతో తమ దేశంలోకి ఎవరినీ పోలాండ్ రానీయటం లేదు. ఉక్రెయిన్లో ఇరుక్కుపోయిన విద్యార్థులు భారత్ రాయబార కార్యాలయంలోను, ఇతర బంకర్లలోను తలదాచుకుంటున్నారు. మరి వీళ్ళ కష్టాలు ఎలా తీరుతాయో.
Indian government issued repeated advisories. Last 2 months, Ukraine was on the brink of war. Foreign missions were folding up.
What were these students and their parents waiting for?
Now, they demand overnight evacuation of thousands from a war zone? pic.twitter.com/kB8GQAsDtR— Abhijit Majumder (@abhijitmajumder) February 24, 2022
Indian Government Sources
Today, a large number of Indian students in Ukraine turned up outside Indian Embassy in Kyiv. Naturally, not all could be accommodated inside Embassy. Embassy has organized safe premises nearby and the students were moved there. pic.twitter.com/kHez66imSQ
— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 24, 2022