సోషల్ మీడియా.. దాని ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య కార్యకర్త నుంచి సీఎం స్థాయి వరకు సోషల్ మీడియాను ఒక ఆయుధంలా వాడుకోవటం చూస్తున్నాం. అయితే.. కొన్ని సందర్భాల్లో పక్కదారి పడుతున్నప్పటికీ.. ఎక్కువ భాగం మేలు కూడా జరుగుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ గా మారింది. ఈ పోస్టు సారాంశం ఏమంటే.. ఏపీలోని వైసీపీ కి సూటిప్రశ్నను సంధిస్తున్నట్లుగా అందులో పేర్కొంటున్నారు. తాము అడిగే రెండు ప్రశ్నలకు వైసీపీలో సమాధానం చెప్పేటోడు ఎవరున్నారు? అని ప్రశ్నిస్తున్నారు.
ఇంతకూ ఆ రెండు ప్రశ్నలు ఏమంటే.. దివంగత మహానేత వైఎస్ సొంత సోదరుడ్ని ఆయన ఇంట్లోనే అత్యంత దారుణంగా చంపేసిందెవరు? అన్నది మొదటి ప్రశ్న కాగా.. రెండో ప్రశ్న.. తెలుగుదేశం ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నలభై రోజుల్లో 36 హత్యలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు కదా? చనిపోయిన ఆ 36 మంది పేర్లు ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.
తప్పుడు ప్రచారాలకు పాల్పడుతూ.. అబద్ధాల్ని నిజాలుగా ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై మండిపాటు వ్యక్తమవుతోంది. తాము అడిగిన ఈ రెండు ప్రశ్నలకు ఎవరు సమాధానాలు ఇచ్చినా ఫర్లేదని.. అసలు తాము అడిగిన రెండు ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? ఉంటే.. వెంటనే చెప్పండంటున్నారు. ఈ షాకింగ్ పోస్టుకు వైసీపీ నేతలు.. క్యాడర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేక సతమతమవుతున్నారు. బలంగా కౌంటర్ ఇవ్వకపోవటం వైసీపీ వైపు వేలెత్తేలా చూపిస్తున్న దుస్థితి.