“ఇది మనసున్న ప్రభుత్వం. కాబట్టే.. అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకు, కులాలకు అతీతంగా అనేక పథకాలు అందిస్తున్నాం. రెండు లక్షల కోట్ల రూపాయల పైచిలుకు లబ్ధి చేకూర్చాం“ – పదే పదే ఏపీ ప్రభుత్వ పెద్ద, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్న మాట ఇది. మరి నిజంగానే వైసీపీ ప్రభుత్వానికి మనసు ఉందా? ఉంటే ఇలానే చేస్తుందా?- ఇదీ ఇప్పుడు నెటిజన్లు వందలు వేల సంఖ్యలో సంధిస్తున్న ప్రశ్న. దీనికి కారణం.. టీడీపీ అధినేత చంద్రబాబును మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడమేనని అంటున్నారు.
ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో అవకతవకలు పాల్పడ్డారని, 341 కోట్ల రూపాయల మేరకు అవినీతి చేశారని ఆరోపిస్తూ(ఇప్పటివరకు ఆధారాలు చూపలేదు) ఏపీ ప్రభుత్వం చంద్రబాబును జైల్లో పెట్టింది. ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుకు దీర్ఘకాలికంగా చర్మసంబంధిత సమస్యలు ఉన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని నాలుగు గోడల మధ్య నిర్బంధించినప్పుడు(జైల్లో) ఆయన ఆరోగ్యానికి కీలకమైన ఏసీ పెట్టాలనే విషయంపై సర్కారు కుశ్చిత మనస్తత్వంతో వ్యవహరించిందని నెటిజన్లు వాపోతున్నారు.
“కోర్టు చెప్పలేదు. జైలు నిబంధనలు అందుకు అంగీకరించవు. అందుకే ఏసీ పెట్టలేదు“ అని సర్కారు తరఫున డీఐజీ రవికిరణ్ వివరణ ఇచ్చుకున్నారు. ఇదే నిజమైతే.. ఇతర విషయాల్లో కోర్టులు చెప్పింది చెప్పినట్టు పాటిస్తున్నారా? అనేదినెటిజన్లు వేస్తున్న ప్రశ్న. అమరావతి రాజధాని నుంచి విశాఖలోని రుషి కొండ వరకు అనేక విషయాల్లో ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్టు చేయడం లేదా? చిత్తం వచ్చినట్టు వ్యవహరించడం లేదా? అని నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు.
ఇప్పుడున్న వాతావరణంలో నెలకు 20 వేల రూపాయల ఆదాయం ఉన్న సగటు జీవి కూడా సాధారణ పరిస్థితిలోనే ఏసీ కావాలని కోరుకుంటున్నారు. ఇది ఆరోగ్య సంబంధిత సమస్య. మరి చర్మ సమస్యలు ఉండి, పైగా 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు భారీ ఉష్ణోగ్రతలకు జైలు గదిలో బంధీగా ఉన్నా.. కనీసం ఈ ప్రభుత్వం తన మనసు చూపించలేక పోయింది. నిబంధనల పేరుతో 32 రెండు రోజులుగా ఆయనను నిర్బంధించి.. ఉక్కపోతకు, ఉష్ణోగ్రతకు గురిచేయడంతో ఆయన సమస్య తిరగబెట్టింది. దీనినే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయంగా వివాదాలు విభేదాలు ఎలా ఉన్నా.. కనీసం మానవత్వంతో కూడా వ్యవహరించలేదని, అంత పెద్ద నాయకుడికి కనీసం ఏసీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కూడా నెరవేర్చలేదని.. కోర్టు చెప్పేవరకు చేతులు ముడుచుకుని కక్ష సాధింపు చర్యగా వ్యవహరించిందని ఈ ప్రభుత్వానికి మనసుందా? ఉంటే ఇలా చేస్తుందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు., మరి దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.