ప్రజలకో, ఓ సామాజిక వర్గానికో, ఏదైనా కుల వృత్తుల వారికో, సినీ రంగానికో..ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోవడం ఆనవాయితీ. వారి సమస్యలు విన్న ప్రభుత్వం…తమకు తోచిన సాయం చేయడం…ఆయా సమస్యలకు పరిష్కారం చూపడం పరిపాటి. కానీ, ఏపీలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రెండ్ మారిందన్న ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక సమస్యను ప్రభుత్వమే సృష్టించి…దానిని చివరకు తామే పరిష్కరించినట్లు బిల్డప్ ఇవ్వడం అనే కొత్త ట్రెండ్ మొదలైందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా టికెట్ల రేట్ల సమస్యను క్రియేట్ చేసిన జగన్ సర్కార్…చివరకు దానిని తామే సాల్వ్ చేసినట్లు క్రియేట్ చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. మనమే ఒక సమస్యను సృష్టించి…దాన్ని మనమే పరిష్కరించాలి….అప్పుడు ఎగిరి గంతేసి మనకే థ్యాంక్స్ చెబుతారు..అన్న కొత్త ఫార్ములాను జగన్ అండ్ కో కనుక్కొన్నారని నెటిజన్లు పంచ్ లు వేస్తున్నారు.
సన్మానం చేయించుకొని చాలాకాలం అయింది…గ్యాస్ కొట్టేందుకు ఆ సినిమావాళ్లని ఇటు రమ్మనండి రా..అని బ్రహ్మి ఇమేజ్ లతో మీమ్స్ పేలుస్తున్నారు. ఈ రోజు భేటీకి వెళ్లినవారంతా జగన్ ను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడేయడంపై నెటిజన్లు కాస్త ఘాటుగానే సెటైర్లు వేస్తున్నట్లు కనిపిస్తోంది. జగనన్నా మా టికెట్ రేట్లు కొంచెం చూడండి అన్నా…అంటూ సినిమావాళ్లు రిక్వెస్ట్ చేస్తే…సరే మా మంచు బావ మొహం చూసి ఒప్పుకుంటున్నా అని బ్రహ్మి ఒప్పుకొని షరతులు పెట్టినట్లు ట్రోలింగ్ జరుగుతోంది.
సినిమా మొత్తం జై జగనన్నా అని స్క్రోలింగ్ రావాలి….మా నవరత్నాల మీద మీ హీరోలు యాడ్స్ చేయాలి…కలెక్షన్లలో 50 శాతం వాటా మా కార్యకర్తల సంక్షేమ నిధికివ్వాలి…అని కండిషన్లు పెట్టి మరీ వారి విన్నపాలలో కొన్నిటిని అంగీకరించినట్లు పంచ్ లు పేలుతున్నాయి.