జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పవన్ పోటీచేస్తున్నారు కాపు సామాజిక వర్గం ఓట్లుఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆయన గెలుపు గుర్రం ఎక్కు తానని నమ్మకంగా ఉన్నారు. అంతేకాదు.. లక్ష ఓట్ల మెజారిటీ తనకు దక్కుతుందని కూడా పవన్ భావిస్తున్నారు. ఇక, ఇక్కడ నుంచి వైసీపీ తరఫున కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ కూడా బరిలోకి దిగనుంది. ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుంటే.. పవన్‌పై పోటీకి ట్రాన్స్ జెండర్ ఒకరు రెడీ అయ్యారు. భారత చైతన్య యువజన పార్టీ(బీసీవై) తరఫున సింహాద్రి తమ్మన్నా పోటీ చేయనున్నారు. అయితే.. ఈ పార్టీ ఏంటో తెలియదు అనుకుంటున్నారా? ఇది పేరున్న పార్టీనే. పైగా.. గత ఎన్నికల వరకు కూడా పవన్‌తో కలిసి ముందుకు నడిచిన బోడే రామచంద్రయాదవ్ దీనిని స్థాపించారు. బీసీలు, యాదవుల హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం ఈయన పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలోనే తమన్నా అనే ట్రాన్స్ జెండర్‌ను పవన్‌పై పోటీకి ప్రకటించారు.ఇక, తమన్నా కూడా ప్రముఖ ట్రాన్స్‌జెండర్. యూట్యూబ్ చానెల్ నడుపుతూ లక్షల్లో ఆదాయం ఆర్జిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. రాజకీయంగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది. అక్కినేని నాగార్జున వ్యాఖ్యతగా వచ్చిన బిగ్ బాస్ షోలోనూ ఆమె పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచి పోటీ చేశారు. అప్పట్లో నారా లోకేష్‌ను ఓడించి తీరుతాననిశపథం చేసి మరీ ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచింది. ఇక, ఇప్పుడు పవన్‌పై పోటీ చేస్తుండడం గమనార్హం.