హైదరాబాద్ లో నానాటికీ రేవ్ పార్టీలు అశ్లీలు నృత్యాలు పెచ్చుమీరుతున్నాయి.
తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు బేగంపేటలోని క్లబ్ టాలీవుడ్ పబ్ (గతంలో ఇది లిస్బన్ పబ్)పై అశ్లీల నృత్యాలు జరుగుతున్నపుడు రైడ్ చేశారు. ఆ సమయంలో అందులో పాల్గొన్న 44 మందిని పట్టుకున్నారు. వారిలో యజమాని కూడా ఉన్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళల చేత ఈ నృత్యాలు చేయిస్తున్నారు.
విదేశాల నుంచి, ముంబై నుంచి వచ్చిన యువతులతో టాప్ లెస్ డ్యాన్సులు చేయిస్తున్నందుకు పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
అరెస్టయిన వారిలో టాలీవుడ్ క్లబ్ యజమాని ఎన్.వేణు గోపాల్ (43), ఆర్. సాయి బరద్వాజ్ (30)తో పాటు 33 మంది పార్టిసిపెంట్లు, తొమ్మిది మంది డ్యాన్సర్లు ఉన్నారు.
పబ్ యాజమాన్యం మహిళలను లైంగికంగా దోపిడీకి గురిచేస్తోందని మరో కేసు పెటినట్టు పోలీసులు తెలిపారు.
పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ క్లబ్‌పై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.