బంగ్లా దేశ్‌లో హిందువులు, ఇతర మైనార్టీలపై దాడులు జరుగుతున్న వైనంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు…బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులను ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనేన సరిహద్దులో పరిస్థితుల సమీక్ష కోసం ఓ ఉన్నతస్థాయి కమిటీని మోదీ సర్కార్ ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో భారతీయులు, హిందువులు, ఇతర మైనార్టీల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షనుంది. ఇస్లామిక్ ఛాందసవాదులు బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజాన్ని లక్ష్యంగా జరుగుతున్న దాడులు, హత్యలను దేశవ్యాప్తంగా పలువురు ఖండిస్తున్నారు.
అయితే, ఈ హత్యలపై, దాడులను అనేక రాజకీయ పార్టీలు ఖండించినప్పటికీ…కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఖండించలేదు. టీఎంసీ, డీఎంకే, ఆప్, బీఎస్పీ, ఆర్జేడీ, ఎంఐఎం, సీపీఐ, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్ థాకరే), సమాజ్ వాదీ పార్టీ, రాహుల్ గాంధీ, అసద్ ఒవైసీ, ప్రియాంక గాంధీ, సంజయ్ సింగ్, ఉద్ధవ్ థాకరే, సంజయ్ రౌత్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మల్లికార్జున్ ఖర్గేలు కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కానీ, వీరంతా గాజాలో ఒక వర్గంపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గతంలో పలు ట్వీట్లు చేశారు. అటువంటిది బంగ్లాలో హిందువులపై దాడులను మాత్రం ఖండించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.