+ విజయవాడ శివారులో నీటమునిగిన అపార్ట్మెంట్లు
+ సెల్లార్లను నడుంలోతు ముంచేసిన బుడమేరు వరద
+ పీకల్లోతు నీటిలోనూ చెక్కు చెదరని టీకేఆర్ అపార్ట్మెంట్
+ బిల్డర్ అప్పారెడ్డి పక్కా ప్లాన్.. అంకిత భావమే కారణం
+ సంతోషం వ్యక్తం చేస్తున్న టీకేఆర్ కుటుంబాలు.. బిల్డర్‌కు ప్రశంసలు
విజయవాడ: నాలుగు దశాబ్దాల చరిత్రలో తొలిసారి కృష్ణానదికి భారీ వరద పోటెత్తడం.. తద్వారా బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడ శివారు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఈ క్రమంలో సాధారణ నివాసాలే కాదు.. మధ్యతరగతి ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన కలల అపార్ట్మెంట్లను కూడా వరద నీరు ముంచేసింది. అజిత్ సింగునగర్, రాధానగర్, పాయకాపురం, నున్న ఇన్నర్ రింగ్ రోడ్డులలో నిర్మించిన అన్ని అపార్ట్మెంట్లలోకీ నీరు చేరింది. దీంతో ఆయా అపార్ట్మెంట్లలో నివసిస్తున్న వందల కుటుంబాలు విలవిల్లాడాయి. బయటకు రాలేక.. ఇంట్లో ఉండలేక.. సతమతమయ్యాయి. మరోవైపు విద్యుత్ కోతలు.. గంటకు గంటకు పెరిగిన వరద వారిని మానసికంగా మరింత కుంగదీసింది. లక్షలు పోసి కొన్న అపార్ట్మెంటుకు కూడా రక్షణ లేదే అన ఆవేదన వ్యక్తం చేశాయి.
ఒకే ఒక్కటి..!
ఇంతలా విజయవాడ శివారు ప్రాంతాన్ని బుడమేరు ముంచెత్తినా.. నున్న ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఒకే ఒక్క అపార్ట్మెంటు టీకేఆర్ టవర్స్ మాత్రం సురక్షితంగా ఉండడం గమనార్హం. చుక్కనీరు కూడా.. గేటు వరకు రాకపోగా.. కనీసం.. అంత వరద వచ్చినా.. దాని జాడ కూడా.. అపార్ట్మెంటు వాసులపై పడకపోవడం గమనార్హం. దీనికి కారణం.. ఈ అపార్ట్మెంటును నిర్మించిన బిల్డర్ అప్పారెడ్డి ఎంతో దూరదృష్టేనని అపార్ట్మెంటు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రోడ్డుకు 4 అడుగుల ఎత్తు వరకు వేసిన పునాదులు.. అపార్ట్మెంటుకు రక్షణగా నిలిచింది. ఎక్కడా రాజీ పడకుండా.. ఆయన చేసిన నిర్మాణం.. ఇంత వరద ఉధృతిలోనూ అపార్ట్మెంటులోకి చుక్కనీరు ప్రవేశించకుండా చేసింది.
దీంతో టీకేఆర్ టవర్స్ వాసులు.. ఇంత వరద వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. రోజులు గడిపారు. అంతేకాదు.. పరులకు సాయం చేయడంలోనూ ముందున్నారు. ఇతర వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వేల సంఖ్యలో భోజనాలు, నీరు అందించారు. బిల్డర్ అప్పారెడ్డి దూరదృష్టి, ఆయన చూపిన అంకిభావాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. లక్షల రూపాయలు పోసి కొన్నా.. తమకు సంతృప్తిగా ఉందని.. ఇంత విపత్తులోనూ.. అపార్ట్మెంటు చెక్కుచెదరలేదని.. సంతోషం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
కోట్లు పోసీ.. కంటిపై కునుకు కరువు..!
ఇదేసమయంలో కోట్ల రూపాయలు ఖర్చుచేసి కొనుగోలు చేసిన నున్న ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోని విల్లాలు, అపార్ట్మెంటు ఫ్లాట్లు.. నడుం లోతు నీళ్లలో చిక్కుకున్నాయి. దీనికి కారణం.. బిల్డర్లు రాజీ పడడం. ముందు చూపు లేకపోవడమేనని ఇక్కడి బాధిత అపార్ట్మెంటు వాసులు లబోదిబోమంటున్నారు. లక్షలు, కోట్లు పోసిన కొన్నామని.. కానీ, ఇప్పుడు సాధారణ ప్రజల మాదిరిగా తాము కూడా రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. `కోట్లు పోసి కొన్నాం.. కంటిపై కునుకు లేకుండా రోజులు గడుపుతున్నాం` అని విల్లాలు కొన్న వారు సైతం ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. చిత్రం ఏంటంటే.. వీరికి విల్లాలు అమ్మిన వారు సైతం.. స్పందించకపోవడంతో ఇంత డబ్బుండీ.. సర్కారు సాయం కోసం వారు అర్థించే పరిస్థితి రావడం.