తెలుగుదేశం పార్టీ తిరుపతి ఉప ఎన్నికపై వేగంగా పావులు కదుపుతోంది. అందరి కంటే ముందుగా లోక్ సభ ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ఖరారు చేశారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. పనబాక లక్ష్మి తిరుపతి లోక్ సభ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీ చేయనున్నారు.
ఉప ఎన్నికల్లో భాగంగా ఎన్నికల వ్యూహంపై అవలంభించాల్సిన విధానంపై లోక్ సభ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగుదేశం అభ్యర్థి గెలుపు కోసం చేయాల్సిన కృషిపై చర్చించారు.
జగన్ నిర్ణయాలతో ఏపీ తీవ్రంగా నష్టపోవడం, మందుబాబులు, పింఛను దారుల్లో వ్యతిరేకత, అమ్మఒడిలో కోత, రేషన్ కార్డుల తొలగింపు వంటి అనేక కారణాలతో ప్రజల్లో జగన్ హవా బాగా తగ్గిపోయింది. దీంతో ప్రజల ఆవేదనను ప్రభుత్వానికి చెప్పే వేదికగా తిరుపతి ఉప ఎన్నికను తెలుగుదేశం తీర్చిదిద్దుతోంది.