జనవరి తిరుమల దర్శనం స్లాట్ బుకింగ్ ఓపెన్

టీటీడీ ప్రకారం వైకుంఠ ఏకాదశి పర్వదినాలు 3వ తేదీతో ముగియనున్నాయి. దీంతో జనవరి 4 నుంచి 31 వరకూ రూ.300 ధరపై ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు విడుదల చేశారు. రోజుకు 20 వేల మందికి  మాత్రమే ఈ టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు.

అధికారులు కోటా ఓపెన్ చేయగానే భక్తులు చకచక బుక్ చేసుకున్నారు. కాసేపు సర్వర్ బిజీగా వచ్చింది. టీటీడీ https://tirupatibalaji.ap.gov.in/ సైట్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.  ఒక్కో యూజర్ ఐడీపై ఆరు వరకూ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. కరోనా నేపథ్యంలో రోజుకు 20 వేల దర్శనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.