టీటీడీ ప్రకారం వైకుంఠ ఏకాదశి పర్వదినాలు 3వ తేదీతో ముగియనున్నాయి. దీంతో జనవరి 4 నుంచి 31 వరకూ రూ.300 ధరపై ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు విడుదల చేశారు. రోజుకు 20 వేల మందికి మాత్రమే ఈ టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు.
అధికారులు కోటా ఓపెన్ చేయగానే భక్తులు చకచక బుక్ చేసుకున్నారు. కాసేపు సర్వర్ బిజీగా వచ్చింది. టీటీడీ https://tirupatibalaji.ap.gov.in/ సైట్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒక్కో యూజర్ ఐడీపై ఆరు వరకూ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. కరోనా నేపథ్యంలో రోజుకు 20 వేల దర్శనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.