ఎపుడో పూర్తిగా నిర్మించి గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇళ్లను పేదలకు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం వారి ఉసురు పోసుకుంటుందని తెలుగుదేశం నేత నారా లోకేష్ అసెంబ్లీ ముందు నిరసనకు దిగారు.
18 నెలల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టని వైఎస్ జగన్ ఏ స్కీమ్ కావాలని అడగడం విడ్డురంగా ఉంది. ఎన్నికల ముందు అన్ని రకాల ఇళ్ళు ఉచితమన్న జగన్ రెడ్డి ఇప్పుడు మడమ తిప్పి, మాట మార్చారు. చంద్రబాబు గారి హయాంలో పేదల కోసం నిర్మించిన ఇళ్ళు వైకాపా ప్రభుత్వం వెంటనే అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన తెలిపాం- నారా లోకేష్
చంద్రబాబు కట్టిన ఇళ్ల విస్తీర్ణం ఒక్కొక్కటి 365 చ.అడుగులు, 430 చదరపు అడుగులు కాగా జగన్ కడుతున్న ఇళ్ల విస్తీర్ణం కేవలం 300 అడుగులే. పేదలను ఎన్నిరకాలుగా మోసం చేయాలో జగన్ అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు.