ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి బలమైనటువంటి ఓటు బ్యాంకు ఏది అని అడిగితే కచ్చితంగా అది గ్రామీణ మహిళా ఓటు బ్యాంకు. ఈ ఈ రెండు వర్గాలను వైసిపి ఆది నుంచి టార్గెట్ చేస్తూ వచ్చింది. నిజానికి గతంలో కాంగ్రెస్కు ఈ రెండు ఓటు బ్యాంకుల్లో బలం ఉండేది. మహిళా ఓటు బ్యాంకు కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు వీరందరూ కూడా కాంగ్రెస్కు చాలా అనుకూలంగా గతంలో వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు దానికి ముందు ఇందిరా గాంధీ ఇచ్చిన ఇల్లు తదితర అంశాలు కావచ్చు.
మహిళా ఓటు బ్యాంకు సహా గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకు అంతా కూడా కాంగ్రెస్కు చాలా అనుకూలంగా ఉంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పోవడంతో వైసిపి ఆ ఓటు బ్యాంకు ను తనువైపు తిప్పుకోగలిగింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో సంక్షేమానికి పెద్దపేట వేసి అమ్మవడి తదితర పథకాలతో మహిళలను, అలాగే గ్రామీణ స్థాయిలో వృద్ధులను ఇంటింటికి పింఛన్ ఇవ్వడం ద్వారా తనవైపు బలంగా తిప్పుకుంది. అయితే ఇది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పాలనలో బాగానే ఉందని వైసిపి చెప్పుకుంటున్నప్పటికీ టిడిపి తాజాగా ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో తీవ్ర స్థాయిలో ఈ రెండు ఓటు బ్యాంకులను కూడా బలంగా కుదిపేస్తోందని చెబుతున్నారు.
ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఇప్పుడు ఇంకా పింఛన్లు పెరుగుతాయి. అదేవిధంగా ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉన్నా 15000 చొప్పున ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇది గ్రామీణ స్థాయిలో ఆసక్తిగా మారితే కచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంకు గల్లంతయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలకు కావాల్సింది డబ్బులు. ఈ విషయం తీసుకున్నట్లయితే మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఎవరు ముందు ఉంటే వాళ్లకి ఓటు వేయటానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు.
ఇందులో ఏదీ వారికి అతీతం కాదు. గతంలో పసుపు కుంకుమ ఇచ్చి 10,000 ఇచ్చాం మాకు ఓటేయమంటే చంద్రబాబు నాయుడికి ఓటేయకుండా 15000 రూపాయలు ఇస్తామన్నటువంటి వైసీపీకి అనుకూలంగా మారారు. దీన్ని బట్టి ఇప్పుడు టిడిపి ప్రకటించినటువంటి తల్లికి వందనం సంక్షేమ పథకానికి మహిళలు మోగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది. అదే విధంగా గ్రామీణ స్థాయిలో రైతులకు రైతు భరోసా కింద 20 వేల రూపాయలు చంద్రబాబునాయుడు ప్రకటించారు. దేశంలో ఎక్కడా కూడా ఈ స్థాయిలో రైతు భరోసా ఎవరూ ఇవ్వడం లేదు.
మన రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా 13000 మాత్రమే ఉంది. దీనిలోనూ 6000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా 7వేల రూపాయలు మాత్రమే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కలిపి రైతులు ఖాతాల్లో జమ చేస్తుంది. కానీ దీనికి భిన్నంగా దీన్ని దాదాపు రెట్టింపు చేసి 13 వేలకి మరో ఏడు వేల రూపాయలు కలిపి 20,000 చంద్ర బాబు నాయుడు ప్రకటించడం గ్రామీణ స్థాయిలో రైతుల ఓటు బ్యాంకు. రైతు కుటుంబాలు ఓటు బ్యాంకు, రైతు సంఘాల ఓటు బ్యాంకు, అదే విధంగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూలీలు వీళ్ళందరిపైనా ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
దీన్ని బట్టి వైసీపీకి ఉన్నటువంటి మెజారిటీ బలం ఏదైతే గ్రామీణ మహిళా ఓటు బ్యాంకు కచ్చితంగా ఈసారి టిడిపి వైపు అనుకూలంగా మోగ్గేటటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.