విశ్వసనీయత అనే పదం కనిపెట్టింది కేవలం తమ కుటుంబం వాడుకోవడానికి మాత్రమే అన్నట్లు జగన్ ఫ్యామిలీ చెప్పుకుంటుంది.
కానీ చరిత్రను జాగ్రత్తగా చదివితే ఆ కుటుంబం మాట తప్పిన సందర్భాలు, మడమ తిప్పిన సందర్భాలతో ఒక వెయ్యి పేజీల పుస్తకం రాయొచ్చు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.
మీరు ఇంకా దీనిని నమ్మపోతే వీడియో సాక్ష్యం చూడండి. ఈ వీడియో చూశాక కూడా మీరు జగన్ కి విశ్వసనీయత ఉందంటే… మేము మిమ్మల్ని ఓట్లు అడగం అంటున్నారు టీడీపీ నేతలు.
నిన్నటి నుంచి వైరల్ అవుతున్న ఈ వీడియో ఏపీ ఓటర్లు కనుక అందరూ చూస్తే కచ్చితంగా అమ్మ జగనో అనక మానరు.
అసలు చాలా వ్యవూహాత్మకంగా మూడేళ్ల ముందు నుంచి హామీలిచ్చి వాటిలో సగానికి సగం మ్యానిఫెస్టోలో లేకుండా చేయడం ద్వారా అక్కడే ఫస్ట్ మడమ తిప్పేసిన జగన్ అధికారంలోకి వచ్చాక జనాన్ని వేటాడి వేటాడి వెన్నుపోటు పొడుస్తున్నారనడానికి ఈ వీడియోనే సాక్ష్యం.
మీరే చూసి చెప్పండి… ఈ వీడియో వైరల్ అయితే, జనమందరూ దీనిని చూస్తే జగన్ కి ఓటేస్తారా…. మీ అభిప్రాయాన్ని ఈ వార్త కింద ఉన్న కామెంట్ బాక్స్ లో రాయండి.