• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

విజయ్ దేవరకొండ.. ఉన్న నెగెటివిటీ చాలదని

admin by admin
May 17, 2022
in Movies, Top Stories
0
0
SHARES
379
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
టాలీవుడ్ హీరోల్లో ఇప్పటి యూత్ ఆలోచనలకు ప్రతిబింబంలా కనిపిస్తుంటాడు విజయ్ దేవరకొండ. తెర మీదే కాక బయట కూడా అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో అతను యువతను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్లు అతను వ్యవహరించే తీరు ఈ కాలం యువతకు బాగా నచ్చుతుంటుంది. ‘అర్జున్ రెడ్డి’ యూత్‌ను ఆకట్టుకోవడానికి తెర మీద అతను కనిపించిన తీరుతో పాటు బయట ఆ చిత్రాన్ని అతను ప్రమోట్ చేసిన తీరు కూడా ఒక కారణం. కొన్నిసార్లు విజయ్ యాటిట్యూడ్ హద్దులు దాటినట్లు కనిపించినా.. అతను మాత్రం తగ్గడు.

ఐతే ఇప్పుడు విజయ్ తన కొత్త సినిమాకు పెట్టుకున్న టైటిల్ కారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు విలన్ అయిపోయాడు. పవన్ కెరీర్లో అతి పెద్ద హిట్టయిన ‘ఖుషి’తో అభిమానులకు ఉన్న ఎమోషనల్ కనెక్షన్ గురించి తెలిసిందే. అది తమిళంలో అదే పేరుతో తెరకెక్కిన చిత్రానికి రీమేక్ అయినప్పటికీ.. ‘ఖుషి’ పేరెత్తగానే పవన్ అభిమానులు చాలా ఎమోషనల్ అయిపోతారు.

అలాంటి టైటిల్‌ను విజయ్ తన కొత్త చిత్రానికి టైటిల్‌గా పెట్టుకోవడాన్ని పవన్ ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీని గురించి అనధికారిక వార్తలు వచ్చినపుడే వాళ్లు విజయ్ మీద పడిపోయారు. హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఈ టైటిల్ అధికారికం అయింది. దీంతో మొన్నట్నుంచి విజయ్‌ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. నిజానికి ఈ టైటిల్ ఖరారు చేసింది విజయ్ అని గ్యారెంటీ లేదు.

దర్శకుడు శివ నిర్వాణనే ఇందుకు బాధ్యుడు కావచ్చు. కానీ దర్శకుడు ఆ టైటిల్ పెట్టినా.. తమను దృష్టిలో ఉంచుకుని విజయ్ ‘నో’ చెప్పాల్సిందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. అలా చేయకుండా తమను కవ్వించడానికే విజయ్ ఇలా చేశాడని వారు ఆరోపిస్తున్నారు. పవన్ టైటిల్ పెట్టుకోవడమే కాక.. పోస్టర్ మీద ‘ది విజయ్ దేవరకొండ’ అని వేసుకోవడం పట్ల కూడా నెటిజన్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

గ్రామర్ ప్రకారం చూస్తే పేర్ల ముందు ‘ది’ పెట్టకూడదు. ఐతే తాను ఒక వ్యక్తిని కాదు.. శక్తిని, వ్యవస్థను అన్నట్లుగా విజయ్ తన పేరు ముందు ‘ది’ పెట్టుకున్నాడని.. అతను హాలీవుడ్ హీరో మాదిరే తన పేరు ముందు ‘ది’ యాడ్ చేసుకున్నాడని.. ఇంత యాటిట్యూడ్ పనికి రాదని అతణ్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇందులో ప్రధానంగా పవన్ ఫ్యాన్స్ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Tags: heroine samantha ruth prabhukushi moviekushi movie 2022pawan fans angry with kushi titlethe vijay devarakondatollywood hero vijay devarakondatrolling on vijay devarakonda
Previous Post

కేసీఆర్ ను బీజేపీ జైలుకు ఎందుకు పంపదో చెప్పిన రేవంత్

Next Post

జగన్ దిగిపోయేనాటికి ఏపీపై అన్ని లక్షల కోట్ల అప్పు?

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Load More
Next Post

జగన్ దిగిపోయేనాటికి ఏపీపై అన్ని లక్షల కోట్ల అప్పు?

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra