ప్రపంచ గతిని సమూలంగా మార్చేసింది కరోనా మహమ్మారి. భవిష్యత్తులో ఏం చెప్పాలన్నా.. ఏ విషయాన్ని విశ్లేషించాలన్నా.. పోలికలు పోల్చే ముందు కరోనాకు ముందు.. కరోనా తర్వాత అనే మాట వినిపించక మానదు.
ప్రపంచ వ్యాప్తంగా మార్పులకు కారణమైన ఈ మహమ్మారి చాలా నగరాల ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింది. అప్పటివరకు ఉన్న పేరు ప్రఖ్యాతులన్ని కరోనా పుణ్యమా అని మట్టి కొట్టుకుపోయాయి.
కరోనా ఎపిసోడ్ కు ముందు ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాలు ఏమున్నాయ్? అన్న ప్రశ్న వేసినంతనే.. యూరోపియన్ యూనియన్ లోని దేశాల్లోని నగరాల పేర్లే ఎక్కువగా వినిపించేవి. కరోనా పుణ్యమా అని ఆ ఇమేజ్ మొత్తం చెరిగిపోయింది.
కరోనా కారణంగా రేగిన కలకలంలో చాలా నగరాలు నివాస యోగ్యం కానివివన్న ముద్రను వేసుకున్నాయి. ఇప్పుడు సరికొత్త నగరాలు ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాల పేరును సొంతం చేసుకున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్.. జపాన్ లోని నగరాలు ముందు వరుసలో ఉండటం విశేషం.
కరోనా కట్టడితో సూపర్ సక్సెస్ సాధించిన న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. జపాన్ లోని ఒసాకా.. ఆస్ట్రేలియాలోని ఆడిలైట్.. మెల్ బోర్న్.. బ్రిస్బేన్.. పెర్త్ లు నిలిచాయి.
న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్.. జపాన్ లోని టోక్యో.. స్విట్జర్లాండ్ లోని జెనీవా జాబితాలో టాప్ టెన్ స్థానాల్ని సొంతం చేసుకున్నాయి. స్విట్జర్లాండ్ తప్పించి.. యూరోప్ దేశాల్లో మరే నగరం లేకపోవటం గమనార్హం.
టాప్ టెన్ జాబితాను చూసినప్పుడు ఆరు నగరాలు ఆస్ట్రేలియాకు చెందినవి కాగా.. తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ నిలిచింది. కరోనాను అదుపు చేయటమే కాదు.. మహమ్మారి కారణంగా తక్కువగా నష్టపోయిన దేశాలుగా ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ లను చెప్పాలి. అదే సమయంలో టాప్ టెన్ నగరాల జాబితాలో దాదాపు ఎనిమిది యూరోపియన్ నగరాలు తమ స్థానాన్ని కోల్పోయాయి.
జర్మనీలోని పోర్ట్ సిటీ అయిన హాంబర్గ్ అయితే.. ఏకంగా 34 స్థానాలు దిగజారి 47వ స్థానానికి పడిపోవటం విశేషం. ఇక.. ప్రపంచంలో మనిషి అన్న వాడు నివసించటానికి ఏ మాత్రం అనువు కాని నగరాల జాబితాలో సిరియాలోని డమాస్కస్ తొలిస్థానంలో నిలిచి.. చెత్త రికార్డును తన సొంతం చేసుకుంది.
Here is the list :
- Auckland, New Zealand
- Osaka, Japan
- Adelaide, Australia
- Wellington, New Zealand
- Tokyo, Japan
- Perth, Australia
- Zurich, Switzerland
- Geneva, Switzerland
- Melbourne, Australia
- Brisbane, Australia